ETV Bharat / bharat

పోలీసులపై ఆగ్రహంతో స్టేషన్​కు నిప్పు.. కానిస్టేబుల్​ మృతి!

Fire in police station: హోలీ రోజున డీజే పెట్టిన వివాదం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓ యువకుడు స్టేషన్​ ఆవరణలోనే మరణించటం వల్ల వందల మంది గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్​కు నిప్పుపెట్టి.. తూటాలు పేల్చారు. ఈ సంఘటన బిహార్​లోని పశ్చిమ చంపారన్​ జిల్లాలో జరిగింది.

Fire in police station
స్టేషన్​కు నిప్పు
author img

By

Published : Mar 19, 2022, 10:56 PM IST

పోలీసులపై ఆగ్రహంతో స్టేషన్​కు నిప్పు

Fire in police station: పోలీస్​ స్టేషన్​ను చుట్టుముట్టిన వందల మంది గ్రామస్థులు నిప్పు పెట్టి.. పోలీసులపై తుపాకులు పేల్చటం వల్ల ఓ కానిస్టేబుల్​ మృతి చెందారు. ఈ సంఘటన బిహార్​ పశ్చిమ చంపారన్​ జిల్లాలోని బెతియా నగరంలో జరిగింది. ఓ యువకుడిని తీవ్రంగా కొట్టటం వల్లే చనిపోయాడనే ఆరోపణలతో స్టేషన్​ ముందు ఆందోళన చేపట్టారు.

Fire in police station
రహదారిపై ధర్నాకు దిగిన గ్రామస్థులు

ఇదీ జరిగింది..

హోలీ రోజున బాల్​థార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఆజ్రానగర్​ గ్రామంలో డీజే ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్థులు. సమాచారం అందుకున్న పోలీసులు డీజే పెట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన అనిరుద్ధ యాదవ్​ను స్టేషన్​కు తీసుకెళ్లారు. అయితే.. ఆ యువకుడు బాల్​థార్​ స్టేషన్​ ఆవరణలోనే చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు వందల మంది స్టేషన్​కు చేరుకుని ఆందోళనకు దిగారు. స్టేషన్​ను చుట్టుముట్టి వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు తుపాకులు పేల్చటం వల్ల పురుషోత్తమ్​పుర్​ స్టేషన్​కు చెందిన ఓ కానిస్టేబుల్​కు తూటా తగిలి ప్రాణాలు కోల్పోయారు.

Fire in police station
గ్రామస్థుల ఆందోళన

అనంతరం.. మృతదేహాన్ని పోలీసు జీపుపై ఉంచి ధర్నాకు దిగారు. యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టటం వల్లే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. బెతియా-బాల్​థార్​ రహదారని దిగ్భందించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఉపేంద్ర నాథ్​ వర్మ సుమారు 2వేల మంది పోలీసులను బాల్​థార్​కు తరలించారు. గ్రామస్థులను చెదరగొట్టి బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి:

అప్పుడే కొబ్బరి బోండాం తాగింది.. అంతలోనే ఆటో రూపంలో..!

దొంగ పేరుతో వాట్సాప్​ గ్రూప్.. ఆ పోలీసుల నయా ట్రెండ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.