ETV Bharat / bharat

లాక్​డౌన్​ భయాలు- పొగాకు కోసం బారులు

గుజరాత్​లో ప్రభుత్వం మళ్లీ లాక్​డౌన్ విధిస్తుందేమోనని అక్కడి ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూనాగఢ్​లో షాపుల ముందు బారులు తీరి.. ముందు జాగ్రత్తగా పొగాకు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.

author img

By

Published : Apr 29, 2021, 7:21 PM IST

Updated : Apr 29, 2021, 7:30 PM IST

tobacco shops
లాక్​డౌన్​ భయాలు- పొగాకు కోసం బారులు

గుజరాత్​లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. లాక్​డౌన్ విధించొచ్చన్న అనుమానాలు అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పొగాకు వ్యసనపరులు.. ముందుజాగ్రత్త పడుతున్నారు. జూనాగఢ్​లోని పొగాకు దుకాణాల ముందు బారులు తీరి పొగాకు కొనుగోలు చేస్తున్నారు.

tobacco shops
జూనాగఢ్​లో లాక్​డౌన్​ భయంతో పొగాకు దుకాణం ముందు బారులు తీరిన జనం
tobacco shops
జూనాగఢ్​లో పొగాకు కొనుగోలు చేస్తున్న జనం

గతేడాదిలా ఇబ్బంది పడొద్దని..

"గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో పొగాకు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. వేల రూపాయలను ఖర్చు చేసి పొగాకును కొనుగోలు చేశాం. అలాంటి ఇబ్బందులు ఇప్పుడు మళ్లీ పడుకూడదనే.. నెలకు సరిపడా కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాం."

-కొనుగోలుదారు.

అయితే.. గుజరాత్​లో పొగాకు అమ్మకాలపై 2012లో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నిషేధం విధించారు. కానీ, ఇప్పుడు మాత్రం వందలాది దుకాణాల్లో వీటి అమ్మకం కొనసాగుతోంది. దిల్లీలో గతవారం లాక్​డౌన్​ విధించినప్పుడు కుడా.. చాలా మంది ఇలాగే మద్యం షాపుల ముందు బారులు తీరిన సంఘటనలు కనిపించాయి.

tobacco shops
పొగాకు దుకాణాల ముందు క్యూ

గుజరాత్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 9 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఏప్రిల్​ 28 నుంచి మే 5 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పింది. ఈ కర్ఫ్యూ కాకుండా 29 నగరాల్లో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిత్యావసరాల సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది.

ఇదీ చూడండి: తండ్రి శవంతో రెండు రోజులుగా ఇంట్లోనే చిన్నారి

ఇదీ చూడండి: కరోనాను జయించిన మాజీ ప్రధాని మన్మోహన్

Last Updated : Apr 29, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.