ETV Bharat / bharat

పెగసస్​ వ్యవహారంపై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ

పెగసస్​ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై సుప్రీంకోర్టు.. సోమవారం మరోసారి విచారణ జరపనుంది. పెగసస్​ వివాదంపై విచారణ కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేయాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

Supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 16, 2021, 5:48 AM IST

పెగసస్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై సుప్రీంకోర్టు.. సోమవారం మరోసారి విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్‌వీ రమణ, జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ అనిరుద్ధ బోస్​లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను కొనసాగించనుంది. పెగసస్​ వివాదంపై విచారణ కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేయాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

ఈ పిటిషన్​పై ఆగస్టు 10న విచారణ జరిపిన ధర్మాసనం.. " కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరగడం దురదృష్టకరం, కోర్టులు జరిపే విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలి" అని వ్యాఖ్యానించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్‌పై ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ సహా సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఇదీ చూడండి: 'పెగసస్​'పై విచారణ ఈనెల 16కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.