సీబీఐ, ఈడీ డైరక్టర్ల పదవీకాలాన్ని పెంచడం కోసం రూపొందించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్ట సవరణ బిల్లు, దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లు.. లోక్సభ ముందు వచ్చాయి. డైరక్టర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి గరిష్ఠంగా ఐదేళ్లకు పెంచుతూ ఇటీవలే ఆర్డినెన్స్ జారీ చేసింది కేంద్రం.
బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్ష నేతలను తీవ్రంగా హింసించేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపించాయి. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందమని మండిపడ్డాయి.
విపక్షాల వైఖరిని మాత్రం కేంద్రం తప్పుబడుతోంది. డైరక్టర్ల పదవీకాలంపై గతంలో ఎటువంటి నిబంధనలు లేవని.. ఇప్పుడు తాము గరిష్ఠంగా ఐదేళ్లు అని చెబుతున్నామని పేర్కొంది.