NITI Aayog New CEO: నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ జూన్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్రం ఆయన వారసుడి పేరును ఖరారు చేసింది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగం మాజీ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్‌ను నీతి ఆయోగ్ సీఈఓగా నియమించింది. 1981 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన అయ్యర్ పారిశుద్ధ్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2009లో ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన.. ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య నిపుణుడిగా పని చేశారు.
పరమేశ్వరన్ అయ్యర్ రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు.. రెండింటిలో ఏది ముందు వస్తే అంతవరకు ఈ పదవిలో కొనసాగుతారు. అమితాబ్ కాంత్ విషయంలో పాటించిన నియమ నిబంధనల ఆధారంగానే అయ్యర్‌ను నియమించినట్లు కేంద్రం తెలిపింది.
మరోవైపు 'రా' చీఫ్ సామంత్ కుమార్ గోయల్ పదవీకాలం మరో ఏడాది పొడిగించింది కేంద్రం. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి తపన్ కుమార్ నియమించింది. కేబినెట్ నియామకాల ఉప సంఘం సిఫారసు మేరకు పదవీ కాలం పొడిగించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: మోదీ కోసం రూ.23కోట్లతో రోడ్లు.. ఒక్క వానతో ఫసక్.. రాష్ట్రంపై పీఎంఓ సీరియస్!