పాకిస్థాన్‌కు చెందిన శ్యామల, పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కమల్ కల్యాణ్ భరత్ కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. చుట్టాల పెళ్లిలో మొదటిసారి శ్యామలను చూసిన భరత్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే శ్యామలే తన సహ ధర్మచారిణి కావాలని నిర్ణయించుకున్నాడు. బంధువుల అమ్మాయి కావటంతో భరత్ మొదట స్నేహమంటూ ఆమెతో మాటలు కలిపాడు. ఇద్దరి మధ్య మాటలు కలవటంతో స్నేహం కాస్త ప్రేమగా వికసించింది. మాట్లాడుకోకపోతే ఆ రోజు గడిచేది కాదు. నువ్వా దరి.. నేనీ దరి అన్నట్లు ఇద్దరి దేశాలు వేరైనా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఇద్దరూ రోజు మాట్లాడుకునేవారు.
ఏడాదికి పైగా సాగిన స్నేహానికి ఎండ్ కార్డ్ వేయాలని నిర్ణయించుకున్న భరత్ ఒక ఫైన్ డే తన మనసులో మాట బయటపెట్టాడు. నువ్వంటే నాకిష్టమని చెప్పాడు. అందుకు శ్యామల కూడా ఓకే చెప్పింది. ఇరువురు తమ ప్రేమను పెద్దలకు చెప్పటం వారు కూడా అంగీకరించటంతో భరత్-శ్యామల పరిచయం పెళ్లిపీటలు ఎక్కింది. ఈనెల 10న వారిద్దరు ఒక్కటి కానున్నారు. భారత్-పాక్‌ల మధ్య వైరమే తప్ప ప్రజల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని, అందుకు తమ ప్రేమపెళ్లే నిదర్శనమని కాబోయే జంట అంటోంది.
ఇవీ చదవండి: ప్రియుడ్ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. అతడు చేసిన పనితో గెస్ట్‌లంతా షాక్
శిందే నియామకంపై సుప్రీంకు ఉద్ధవ్.. మధ్యంతర ఎన్నికలకు డిమాండ్