కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న భారత్-పాకిస్థాన్ సరిహద్దు మరోసారి తుపాకీ మోతలతో దద్దరిల్లింది. దాయాది దేశం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. పాక్ రేంజర్లు కాల్పులకు తెగపడినట్టు భారత సరిహద్దు దళం(బీఎస్ఎఫ్) వెల్లడించింది.
పాక్ కాల్పులను దీటుగా తిప్పికొట్టామన్న బీఎస్ఎఫ్.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న సరిహద్దులో శాంతి స్థాపనకు భారత్-పాక్ ఒప్పందం చేసుకున్న తర్వాత పాక్ కాల్పులకు దిగడం ఇదే తొలిసారని భద్రతా అధికారులు తెలిపారు. సరిహద్దు ఫెన్సింగ్‌కు ముందు పెట్రోలింగ్ పార్టీపై పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయని వివరించారు.
ఇదీ చదవండి: సాయంత్రం బంగాల్ గవర్నర్‌తో మమత భేటీ