ETV Bharat / bharat

సరిహద్దులో డ్రోన్ల కలకలం- గ్రనేడ్లు స్వాధీనం

author img

By

Published : Dec 21, 2020, 5:34 PM IST

పాక్​ కుట్రను మరోసారి తిప్పికొట్టింది భారత సైన్యం. సరిహద్దులో అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న పాక్​ డ్రోన్లను దళాలు గుర్తించాయి. అవి జారవిడిచిన 11 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి.

11 grenades
'భారత సరిహద్దుల్లో 11 పాక్​ గ్రనేడ్లు లభ్యం'

ఆయుధాలను అక్రమంగా తరలించే పాక్​ కుట్రను భారత సైన్యం మరోసారి భగ్నం చేసింది. పంజాబ్​లోని గురుదాస్​పుర్​ తాలూకా సలాచ్​ గ్రామంలో డ్రోన్ల​ సంచారం కలకలం రేపింది. వాటిని గమనించిన భద్రతా దళాలు కూల్చేందుకు ప్రయత్నించగా.. అవి అదృశ్యమైనట్టు గురుదాస్​పుర్ ఎస్పీ ​రాజిందర్​ సింగ్​ సోహాల్​ తెలిపారు.

అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటరు దూరంలోని పొలాల్లో డ్రోన్లు​ జారవిడిచిన హ్యాండ్​ గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్ని ఒక చెక్కపెట్టెలో ప్యాక్​ చేసి ఉన్నట్లు సోహాల్​ తెలిపారు.

ఆదివారం ఒక డ్రోన్​ ఎగురుతుండటం భారత సరిహద్దు దళం గమనించి కాల్పులు సైతం జరిపింది. అది అదృశ్యమైనా ఆపరేషన్​ని కొనసాగించాం. 11 హ్యాండ్​ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం.

-రాజిందర్​ సింగ్​ సోహాల్​, గురుదాస్​పుర్​ సీనియర్​ ఎస్పీ ​

గత కొద్దికాలంగా ముష్కరులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలను చేరవేస్తోంది పాక్. ఇప్పటివరకూ వివిధ ఘటనల్లో డ్రోన్లు జారవిడిచిన ఏకే-47లు, మెషిన్​ గన్​లు, భారీ ఆయుధ డంప్, నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:'చైనా దళాల చొరబాటు వార్త అవాస్తవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.