ETV Bharat / state

విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ ఘోష్ తీవ్ర ఆగ్రహం - INQUIRY ON KALESWARAM PROJECT

Justice Ghosh Commission Inquiry Updates : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రత్యేకంగా మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్‌ ఫైల్స్‌ వినియోగించమని ఎవరు సూచించారని కమిషన్‌ ప్రశ్నించగా సీడీఓసీఈ సూచనల మేరకు ఇలా చేశానని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. దీనిపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్​కు తప్పుడు సమాచారం ఇస్తారా అని మండిపడింది. వివిధ అంశాలకు సంబంధించి ఆయనను కమిషన్‌ ప్రశ్నించింది.

Justice Ghosh Commission Inquiry Updates
Justice Ghosh Commission Inquiry Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 4:36 PM IST

Inquiry On Kaleswaram Project : మాజీ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీకెంట్‌ ఫైల్స్‌పై వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానంపై మండిపడ్డారు. తన వద్ద ప్లాన్స్‌, డిజైన్స్‌ ఉన్నాయని కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇస్తారా? అని జస్టిస్‌ ఘోష్‌ ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ఈఎన్సీగా పని చేసిన వెంకటేశ్వర్లు ఇవాళ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. వివిధ అంశాలకు సంబంధించి ఆయనను కమిషన్‌ ప్రశ్నించింది. ప్రత్యేకంగా మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్‌ ఫైల్స్‌ వినియోగించమని ఎవరు సూచించారని కమిషన్‌ ఛైర్మన్‌ ప్రశ్నించగా సీడీఓసీఈ సూచనల మేరకు ఇలా చేశానని సమాధానమిచ్చారు. దీనిపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కమిషన్​ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు : కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని ఘాటుగా జస్టిస్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు. అయితే, తన సమాధానాన్ని సరిచూసుకునే అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరగా దీనికి అంగీకరించబోనని తేల్చి చెప్పారు. తగిన దస్త్రాలు సమర్పిస్తే సవరించుకునే అవకాశం ఇస్తామని అన్నారు. తనకు ఆంగ్లంపై పూర్తిగా పట్టు లేదని వెంకటేశ్వర్లు తెలపగా ఆంగ్లంపై పట్టు లేకుండానే కాళేశ్వరం సీఈగా ఎలా పని చేశారని కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. డీపీఆర్ ఆమోదం తర్వాత డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయన్న కమిషన్ గేట్ల సంఖ్య, సైజ్, రాఫ్ట్, పిల్లర్ల సంఖ్యలో మార్పు ఎందుకు వచ్చిందనే వివరాలు కోరింది. ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారని ప్రశ్నించింది.

Judicial Inquiry On Kaleswaram : బ్యారేజీ పొడవులో మార్పు ఎందుకు వచ్చిందని కమిషన్ అడిగిన ప్రశ్నకు సీడీఓ సీఈ నిర్ణయం మేరకే మార్పులు జరిగాయని ఈఎన్సీ వెంకటేశ్వర్లు వివరించారు. కాగా సవరించిన అంచనాలను ఎవరు ఎప్పుడు ఆమోదించారనే విషయంపై కమిషన్ ఆరా తీసింది. 2018 మే 19న మొదటి, 2021 సెప్టెంబర్ 6న రెండో సవరణ జరిగిందని వెంకటేశ్వర్లు కమిషన్​కు తెలిపారు. ఆనకట్టల నిర్మాణానికి 11 అనుమతులు తీసుకున్నట్లుగా తెలిపారు. కాగా ఉన్నత స్థాయి కమిటీలో ఉండే వారి గురించి ఘోష్ కమిషన్ ఆరా తీసింది.

ప్రశ్నల వర్షం కురిపించిన కమిషన్ : బ్యారేజీల నిర్మాణ వ్యయం ఎంత? వ్యాప్కోప్ నివేదికను ఎవరు ఆమోదించారు? సవరించిన అంచనాలు ఆమోదించింది ఎవరు? ఎప్పుడు? తదితర అంశాలపై కమిషన్ ఆరా తీసింది. దీనిపై వెంకటేశ్వర్లు వివరణఇస్తూ నిర్మాణానికి సంబంధించిన వివరాలు డీపీఆర్​లో ఉన్నాయని వాటిని రేపు ప్రకటిస్తామని తెలిపారు. వ్యాప్కొప్ నివేదికను 2016లో ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించిందని కమిషన్​కు తెలిపారు. 2018 మే 19న మొదటి,2021 సెప్టెంబర్ 6న రెండో సవరణ జరిగిందని వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి 11 అనుమతులు తీసుకున్నట్లుగా తెలిపారు.

అసహనం వ్యక్తం చేసిన కమిషన్ : ఉన్నతస్థాయి కమిటీలో ఉండేవారి గురించి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆరా తీసింది. కమిటీలో సీఎంఓ కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, వ్యాప్కోస్ సభ్యుడు ఉంటారని కమిషన్​కు వెంకటేశ్వర్లు తెలిపారు. పిల్లర్ల డ్యామేజీకి కారణలపై కమిషన్ ప్రశ్నించగా మోతాదుకు మించిన వేగంతో నీటి విడుదల వల్లే దెబ్బతిందని సమాధానమిచ్చారు. భూసేకరణ సమస్య, విద్యుత్ పొదుపు, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసమే అన్నారం సుందిళ్ల సైట్లను మార్చినట్లుగా వెంకటేశ్వర్లు తెలిపారు. అఫిడవిట్‌లో ఉన్న అంశాలనే క్రాస్ ఎగ్జామినేషన్‌ సమయంలో చూసి చెప్పడంపై జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.

అకౌంట్స్​ అధికారులపై ప్రశ్నల వర్షం - కాళేశ్వరానికి నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపుల అంశాలపై కమిషన్‌ ఆరా - Kaleshwaram Finance Officer Inquiry

కాళేశ్వరం డిజైన్లను ఎవరు తయారు చేశారు? : జస్టిస్​ పీసీ ఘోష్ - kaleshwaram commission Investigate

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.