Pakistan construction along LoC: సరిహద్దులో పాకిస్థాన్ మళ్లీ తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి నిర్మాణాలు చేపడుతోంది. అయితే.. పాక్ చర్యలపై భారత ఆర్మీ మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
"జమ్ముకశ్మీర్ కుప్వారాలోని తీత్వాల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అసాధారణ నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. దీనిపై లౌడ్‌స్పీకర్ల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశాం. ఎందుకంటే.. పాక్ నిర్మాణాలు చేపట్టిన ప్రదేశం భారత భూభాగానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది" అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి 'ఈటీవీ భారత్'కు తెలిపారు.
Pakistan india border: తాము అభ్యంతరం వ్యక్తం చేయగా పాక్ నిర్మాణపనులను నిలిపివేసిందని సదరు అధికారి తెలిపారు. అయితే.. పాక్ ఈ ప్రాంతంలో వేటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోందో తెలియదు అని చెప్పారు. నిబంధనల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా ఎల్ఓసీ వెంబడి ఇరుపక్షాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్‌పై పాక్ దుష్ప్రచారం!.. 20 యూట్యూబ్ ఛానెళ్లు మూసివేత
ఇదీ చూడండి: లోక్‌సభ సమావేశాల కోసం ప్రత్యేక యాప్- ప్రవేశపెట్టిన స్పీకర్