ETV Bharat / bharat

సరిహద్దుల్లో 'పాక్​'​ బెలూన్ కలకలం.. పోలీసుల హైఅలర్ట్​ - pakistan balloon in india

Pakistan balloon in India: పంజాబ్​లోని పాకిస్థాన్​ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన ఓ బెలూన్​ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు బెలూన్​ను స్వాధీనం చేసుకుని, ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Pakistan balloon in India
పాకిస్థాన్​ బెలూన్​
author img

By

Published : Mar 26, 2022, 5:12 PM IST

Updated : Mar 26, 2022, 6:15 PM IST

Pakistan balloon in India: పంజాబ్​ జలంధర్​ జిల్లాలోని అధంపుర్​ సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్​కు చెందిన ఓ బెలూన్​ కలకలం సృష్టించింది. బెలూన్​పై పాకిస్థాన్​ జెండా, 'ఐ లవ్​ పాకిస్థాన్' అని​ ముద్రించి ఉంది. పంట పొలాల్లో బెలూన్​ కనిపించినట్లు సమాచారం అందుకున్న అధంపుర్​ పోలీసులు అక్కడికి చేరుకుని బెలూన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై స్థానిక స్టేషన్​​ ఎస్​హెచ్​ఓ హరిందర్​ సింగ్​ పలు విషయాలు వెల్లడించారు.

Pakistan balloon in India
ఐ లవ్​ పాకిస్థాన్​ అని రాసి ఉన్న బెలూన్​

"ఐ లవ్​ పాకిస్థాన్​, ఆ దేశ జెండా ముద్రించి ఉన్న ఓ బెలూన్​ పొలాల్లో కనిపించినట్లు సమాచారం అందింది. మా సిబ్బందితో అక్కడికి చేరుకుని బెలూన్​ను స్వాధీనం చేసుకున్నాం. దానిని పరిశీలించాక ఎవరో కావాలనే చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చాం. బెలూన్​ పాకిస్థాన్​ నుంచి వచ్చే అవకాశం లేదు. అయితే, అది ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేపట్టాం."

- హరిందర్​ సింగ్​, అధంపుర్​ ఎస్​హెచ్​ఓ.

ఇదీ చూడండి: సరిహద్దు దాటి భారత్​లోకి పాక్ బాలిక.. జవాన్లు ఏం చేశారంటే?

Last Updated : Mar 26, 2022, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.