ETV Bharat / bharat

ఆ పండ్ల తోటలు ఏనుగుల కోసమే! - elephant lovers

ఏనుగుల కోసమే ప్రత్యేకంగా వరి పొలాలు, పండ్ల తోటలు పెంచుతూ వన్యప్రాణుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు అసోంకు చెందిన దంపతులు వినోద్​ దులు బోరా, మేఘన మయూరి. ఆహారం కోసం జనావాసాల్లోకి వెళ్లకుండా గజరాజులను అడ్డుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. స్థానికుల సాయంతో హాథీబొంధు అనే సంస్థను స్థాపించారు.

Paddy fields and orchards, especially for elephants
ఏనుగుల కోసం వన్యప్రాణి ప్రేమికుల పండ్ల తోటలు
author img

By

Published : Nov 27, 2020, 1:31 PM IST

ఏనుగుల కోసం వన్యప్రాణి ప్రేమికుల పండ్ల తోటలు

ఆహారం కోసం పంటపొలాల్లోకి వచ్చే ఏనుగులు, రైతులకు మధ్య ఘర్షణలు జరగడం కొత్తేం కాదు. అటవీప్రాంతం వేగంగా తగ్గుతున్న అసోంలో ఈ ఘటనలు మరీ ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన వన్యప్రాణి ప్రేమికుడు వినోద్ దులు బోరా, ఆయన భార్య మేఘన మయూరి హజారికా కృషిచేస్తున్నారు. ఏనుగులకోసమే ప్రత్యేకంగా వరిపొలాలు, పండ్ల తోటలు పెంచుతున్నారు. ఆహారం కోసం జనావాసాల్లోకి వెళ్లకుండా వాటిని అడ్డుకోవడమే వారి ఉద్దేశం. ఇందుకోసం స్థానికుల సాయంతో హాథీబొంధు అనే సంస్థను స్థాపించారు ఈ దంపతులు.

గతేడాది హాథీ బొంధు సంస్థ 200 బిగాల్లో వరి పండించింది. రోంగాంగ్ గ్రామస్థులు ఏనుగుల కోసం భూమిని దానంగా ఇచ్చారు. ఫలితంగా మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. ప్రజల విన్నపం మేరకు మరో 600 బిగాలు ఏనుగుల కోసమే కేటాయించాం. 200 బిగాల్లో వరి పండించి, మిగతా భూముల్లో నేపియర్ గడ్డి, చీపురుగడ్డి, పనసతోటలు, ఎలిఫెంట్ ఆపిల్ తోటలు పెంచాం.

-వినోద్ దులు బోరా, ప్రకృతి ప్రేమికుడు.

'హాథీ బొంధు'కు అసోం అటవీ శాఖ కూడా సహకారమందిస్తోంది. ఆహారం కోసం వెదుక్కుంటూ ఏనుగుల గుంపులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు కొద్దినెలలుగా బాగా తగ్గాయి.

2018లోనే హాథీ బొంధు ఉద్యమాన్ని ప్రారంభించాం. అప్పుడు మాకు స్పష్టమైన ఆలోచనైతే లేదు గానీ.. ఏనుగుల కోసం 15 నుంచి 20 వేల అరటి, పనస మొక్కలు నాటాం. 2019లో వరి పండించేందుకు రోంగాంగ్ గ్రామ ప్రజలు మా సంస్థకు కొంత భూమిని విరాళంగా ఇచ్చారు. కర్బీ అంగ్లాంగ్ పర్వత ప్రాంతంలోని ఓ ఆదివాసీ గ్రామం అది.

-ప్రదీప్ భుయాన్, హాథీ బొంధు సంరక్షకుడు

వినోద్ చేపట్టిన ఈ మంచి పనిలో ఆయన భార్య మేఘన మయూరి హజారికా పూర్తి సహకారం అందించారు. పరిస్థితులను నిత్యం పర్యవేక్షించేందుకు వీలుగా దంపతులిద్దరూ చెట్టుపై నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నారు. వారు పెంచుతున్న వరి, గడ్డి పొలాల్లోకి రాత్రులు వచ్చి, ఉదయం తిరిగి అడవులకు వెళ్లే ఏనుగులను వాళ్లు రోజూ చూస్తారు.

ప్రతిరాత్రి ఆహారం కోసం గుంపులుగా వచ్చే ఏనుగులను చూస్తున్నాం. ఏనుగులు ప్రశాంతతను కోరుకుంటాయి. వాటిని ఆప్యాయంగా చూసుకుంటే ఏనుగులతో మనకయ్యే ఘర్షణలు పూర్తిగా తగ్గిపోతాయి. రోంగాంగ్లో మేం వందకు వందశాతం ఫలితాలు చూస్తున్నాం.

-మేఘనా మయూరి హజారికా, ప్రకృతి ప్రేమికురాలు

హాథీ బొంధు ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు చాలావరకు తగ్గాయి. అవి పొలాల్లోకి వచ్చి, కడుపు నిండా తిన్న తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయి. గతంలో ఏనుగుల భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన గ్రామస్థులు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ఏనుగుల దాడులు తగ్గించేందుకు ఈ పద్ధతి ఇతర ప్రాంతాలవారికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: తండ్రి స్ఫూర్తితో.. 22మంది పేద బాలికలకు జీవితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.