ETV Bharat / bharat

పోటీకి దూరంగా 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు - కారణమేంటి? - టీఎంసీ అభ్యర్థులు

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నప్పటికీ.. యావత్​ దేశం దృష్టి మాత్రం బంగాల్ పైనే. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార తృణమూల్​ కాంగ్రెస్​ 294 సీట్లకు గాను 291 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అయితే.. ఆ జాబితా 20 మందికిపైగా సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, మంత్రులు లేకపోవడం గమనార్హం. పోటీకి వారంతట వారే దూరంగా ఉన్నారా? లేక పార్టీనే పక్కన పెట్టిందా? లేకుంటే అది టీఎంసీ వ్యూహంలో భాగమేనా? మరేదైనా ఆంతర్యం ఉందా?

Trinamool congress
పోటీకి దూరంగా 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు
author img

By

Published : Mar 6, 2021, 5:39 PM IST

Updated : Mar 6, 2021, 7:07 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో పార్టీలు తమ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే అనూహ్యంగా 294సీట్లకు గానూ.. 291 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది అధికార తృణమూల్​ కాంగ్రెస్ అశ్చర్యపరిచింది. మరో 3 స్థానాలను తమ కూటమి పార్టీ 'గోర్ఖా జన్ముక్తి మోర్చా'(జీజేఎం)కు వదిలేసింది. అయితే.. తాజాగా విడుదల చేసిన జాబితాలో 20 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, మంత్రులు పేర్లు లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వేరు వేరు కారణాలతో వారే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వారిలో కీలక నేతలు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్​ మిత్రా, రెవెన్యూ మంత్రి అబ్దుల్​ రజాక్​ మొల్లా, వ్యవసాయ శాఖ మంత్రి పుర్నేందు బసులు ఉండటం గమనార్హం. వయసు పైబడటం, కొవిడ్​-19 మహమ్మారి ముప్పు కొనసాగుతుండటం వల్లే వారు తమ అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవడానికి కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. భవిష్యత్తు ఎన్నికల్లో తాను తిరిగి పోటీ చేస్తానని తెలిపారు మిత్రా. ప్రస్తుత మహమ్మారి సమయంలో రిస్క్​ తీసుకోదలుచుకోలేదని, అందుకే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

ఆ మంత్రుల స్థానాల్లో ఎవరు?

  • ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా నియోజకవర్గం నుంచి గెలిచిన మిత్రా స్థానంలో.. కాజల్​ సిన్హాకు టికెట్టు ఇచ్చింది అధికార పార్టీ.
  • దక్షిణ 24 పరగణాల జిల్లా భంగర్​ నియోజకవర్గంలో రజాక్​ మొల్లా స్థానాన్ని.. మొహమ్మద్​ రెజౌల్​ కరీమ్​తో​ భర్తీ చేయనున్నారు.
  • ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రాజాఘాట్​ గోపాల్​పుర్​ నుంచి బసు స్థానంలో అదితి మున్షికి టికెట్టు ఇచ్చారు.

పోటీలో కీలక నేతలు..

291 అభ్యర్థుల్లో టీఎంసీ నేత మదన్​ మిత్రా.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కమరహట్టి నియోజకవర్గం బరిలో నిలుస్తున్నారు. కోల్​కతా పోర్ట్​ నుంచి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్​ హకిమ్​ పోటీ చేస్తున్నారు. కోల్​కతాలోని భవానిపుర్​ నుంచి ఎమ్మెల్యే సోభన్​దేబ్​ ఛటోపాధ్యాయ్​ నిలబడుతున్నారు. నటి సయాంతికా బెనర్జీ-బంకుర్​, నటుడు చిరంజీత్​ చక్రబర్తి- బరసత్​, క్రికెటర్​ మనోజ్​ తివారి- శిబ్​పుర్​ల నుంచి బరిలో నిలుస్తున్నారు.

ఆసక్తికరంగా ఆ మూడు స్థానాలు..

ఈ ఎన్నికల్లో జీజేఎంతో జత కలిసింది అధికార పార్టీ టీఎంసీ. కలింపోంగ్​, డార్జీలింగ్​, కుర్సేంగ్​ స్థానాలకు మిత్ర పక్షానికి సైతం కేటాయించింది. జీజేఎం నేత బీమల్​ గురుంగ్ ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించారు. మరోవైపు.. జీజేఎం తిరుగుబాటు నేత, బెనోయ్​ తమాంగ్​ కూడా ఈ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మూడు స్థానాల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది తృణమూల్​ కాంగ్రెస్​. ఈ ప్రాంతంలోని మరో పార్టీ జీఎన్​ఎల్​ఎఫ్​.. భాజపాకు మద్దతు పలుకుతోంది. దానితో ఈ మూడు స్థానాలను జీఎన్​ఎల్​ఎఫ్​కే వదిలేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా ఈ స్థానాల్లో జేజీఎమ్​, జీఎన్​ఎల్​ఎఫ్​, కాంగ్రెస్​-లెఫ్ట్​-ఐఎస్​ఎఫ్​ కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. తెరాయ్​, దూవార్స్​ ప్రాంతంలోని ఎన్నికల్లో తృణమూల్​కు మద్దతుగా నిలుస్తామని జీజేఎమ్​కు చెందిన గురుంగ్​, తమాంగ్​ వర్గాలు ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి: మమత స్థానచలనం వెనక మతలబేంటి?

నందిగ్రామ్​ నుంచే దీదీ పోటీ- 291 సీట్లకు అభ్యర్థులు ఖరారు

Last Updated : Mar 6, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.