దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 2.91 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 9 లక్షల 74 వేల మందికి టీకా వేసినట్లు వెల్లడించింది.
మొత్తంగా 73 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి, 72 లక్షల 96 వేల ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిడోసు టీకా అందించినట్లు పేర్కొంది. 42 లక్షల 58 వేల మంది ఆరోగ్య సిబ్బంది, 10 లక్షల 53 వేల మంది ఫ్రంట్‌లైన్ సిబ్బంది రెండో డోసు టీకాను అందుకున్నట్లు తెలిపింది.
78 లక్షల 66 వేలమంది వృద్ధులకు వ్యాక్సిన్ వేయగా.. 13 లక్షల 86 వేల మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లుపైబడినవారు టీకాను పొందారు.
ఇదీ చూడండి: 'మరిన్ని కొవిడ్ టీకాలు రాబోతున్నాయ్'