దేశంలో వైరస్ వ్యాప్తికి సంపూర్ణ లాక్డౌన్ సరైన సమాధానమని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లాక్డౌన్ విధించినప్పటికీ 'న్యాయ్' పథకం ద్వారా పేదలకు చేయూతనందించాలని అన్నారు.
"ప్రభుత్వానికి ఇంకా అర్థం కావట్లేదు. కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ తప్పనిసరి. న్యూతమ్ ఆయ్ యోజనతో పేదలకు అండగా నిలవాలి. కేంద్రం ఎందరో పేదల మృతికి కారణమవుతోంది."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
కేంద్రం, రాష్ట్రాలు తీసుకునే ప్రయాణాలపై ఆంక్షలు, కర్ఫూ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని పేదలకు మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అందుకే వారికి నెలకు కొంత నగదు అందించడం అవసరమని తెలిపింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన న్యాయ్ పథకాన్ని అమలు చేయడం అవసరమని నొక్కిచెప్పింది.
ఇదీ చదవండి:రూ. 42కోట్లు విలువ చేసే బంగారం-వెండి సీజ్