ETV Bharat / bharat

'బ్రహ్మోస్​'కు భలే గిరాకీ- భారత్​ కీలక షరతు - సూపర్​ సానిక్​ బ్రహ్మోస్​

బ్రహ్మోస్​ క్షిపణికి సంబంధించి ప్రస్తుతానికి డిఫెన్సివ్​ వర్షెన్​ను మాత్రమే అమ్మకానికి పెట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. స్వీయ రక్షణ కోసం దీనిని వినియోగించేలా భారత్​ ఈ చర్యలు తీసుకుంటోంది. అనేక దేశాలు ఈ విధ్వంసకర క్షిపణిని దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.​

Only 'defensive' version of India's Brahmos missile for export
అమ్మకానికి 'బ్రహ్మోస్​' రక్షణాత్మక వర్షెన్​ మాత్రమే!
author img

By

Published : Nov 26, 2020, 6:25 PM IST

భారత్​ రూపొందించిన విధ్వంసకర బ్రహ్మోస్​ క్షిపణిని కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి రక్షణాత్మక వర్షెన్​ను మాత్రమే అందించాలని భారత్​ నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు 'ఈటీవీ-భారత్​'కు తెలిపాయి.

"దక్షిణాఫ్రికా నుంచి దక్షిణ అమెరికా వరకు అనేక దేశాలు భారత్​ను సంప్రదిస్తున్నాయి. కానీ ఇప్పటికైతే భూమి నుంచి సముద్రంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణి మాత్రమే అమ్మకానికి ఉంది. దీనినే డిఫెన్సివ్​ వర్షెన్​ అని అంటారు. స్వీయ రక్షణ కోసం దేశాలు దీనిని కొనుగోలు చేయవచ్చు. విమానం, నౌక, జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్షిపణి(అఫెన్సివ్​ వర్షెన్​)ని ప్రస్తుతం భారత్​ అమ్మడం లేదు."

--- అధికార వర్గాలు.

ఫిలిప్పీన్స్​ దేశంతో బ్రహ్మోస్​ అమ్మకానికి ఒప్పందం కుదిరిందని ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే అనేక దేశాలు తమను సంప్రదిస్తున్నాయని, ఫిలిప్పీన్స్​తో ఇంకా ఏ ఒప్పందం కుదరలేదని అధికార వర్గాలు స్పష్టంచేశాయి.

బ్రహ్మోస్​లో ఎన్నో వేరియంట్లు ఉన్నాయి. భూమి, సముద్రం, ఆకాశంలో ప్రయోగించే సదుపాయంతో పాటు హైపర్​సానిక్​ వర్షెన్​ కూడా అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మంగళవారం.. భూమి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాలను చేధించే బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) విజయవంతంగా పరీక్షించింది.

(రచయిత: సంజయ్ బారువా, సీనియర్ పాత్రికేయులు)

ఇదీ చూడండి:- బ్రహ్మోస్​తో టార్గెట్​ చేస్తే.. 4వేల కి.మీ దూరమైనా ఫట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.