ఉత్తర్‌ప్రదేశ్(Up Crime News) అయోధ్య జిల్లాలో(Uttar Pradesh Ayodhya News) దారుణం జరిగింది. దుర్గాదేవి మండపంలోకి చొరబడిన దుండగులు.. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారు.
ఎలా జరిగింది?
ఫైజాబాద్(Uttar Pradesh Ayodhya News) కొత్వాలీ ప్రాంతంలోని నీల్ గోదాం దుర్గా మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు దుండగులు రెండు బైకుల మీద వచ్చారు. ఆకస్మాత్తుగా మండపంలో ఉన్న మంజిత్ యాదవ్‌పై వారు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అతని పక్కన ఉన్న ఇద్దరు బాలికలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లఖ్‌నవూలోని కేజీఎంయూ ట్రామా సెంటర్‌కు తరలించారు.
![firing in duga pandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-02-jagran-me-firing-pkg-up10135_13102021234331_1310f_1634148811_1081.jpg)
![firing in duga pandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-02-jagran-me-firing-pkg-up10135_13102021234331_1310f_1634148811_576.jpg)
కాల్పుల అనంతరం.. మండపంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాంతో దుండగులు వెంటనే.. తమ బైకులను అక్కడే వదిలేసి పరారయ్యారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ నిందితుడ్ని పట్టుకుని, విచారిస్తున్నారు.
వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే దుండగులు దుర్గా మండపంలోకి చొరబడి, కాల్పులు జరిపినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని లఖ్‌నవూ జోన్ ఏడీజీ ఎస్.ఎన్.సాబత్ తెలిపారు. ఘటన జరిగిన రోజు ఉదయం.. నిందితులకు, బాధితుడికి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రాణాలు తీసిన పరోటా- ఆ తల్లీకూతుళ్లకు ఏమైంది?
ఇదీ చూడండి: కారు అద్దంలో మెడ ఇరుక్కొని బాలుడు మృతి