ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లోని డోయీవాలా ప్రాంతంలో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ సోదరుడు, వ్యాపారి శిశ్‌పాల్ అగర్వాల్ ఇంట్లో రూ. కోటి నగదును ఎత్తికెళ్లిపోయారు. శిశ్‌పాల్ ఇంట్లోకి ప్రవేశించిన ఆరుగురు దుండగులు... ఆయన భార్య, ఇద్దరు పని మనుషులను బంధించి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. శిశ్‌పాల్ అగర్వాల్.. ఇంటి బయట అమర్చిన సీసీటీవీలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
పన్నీరుసెల్వం ఫాంహౌస్‌లో..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వంకు చెందిన ఫాంహౌస్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన తేనీ జిల్లాలోని పెరియకులం సమీపంలోని కైలాసపట్టిలో జరిగింది. శుక్రవారం రాత్రి దుండగులు ఫాంహౌస్ గోడ ఎక్కి మేడమీద ఉన్న గది తలుపులు పగలగొట్టి 54 అంగుళాల టీవీని ఎత్తికెళ్లినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూసే సరికి పైఅంతస్తులోని గది తాళాలు పగలగొట్టి కనిపించాయి. ఈ క్రమంలో పెరియకులం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్ సర్టిఫికెట్తో పాటు ఆధార్
పైథాన్ల వ్యాపారం.. ఒక్కోటి రూ.4లక్షలకు విక్రయం.. కొనాలని ఉందా?