ETV Bharat / bharat

తండ్రి బిర్యానీ తీసుకురాలేదని.. కొడుకు ఆత్మహత్య! - ODISSHA NEWS

BOY SUICIDE IN ODISHA: ఆడుతూ పాడుతూ సరదాగా జీవితాన్ని ఎంజాయ్​ చేయాల్సిన ఓ 13 ఏళ్ల బాలుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. తన తండ్రి బిర్యానీ తీసుకురాలేదనే మనస్తాపంతో.. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

suicide
boy suicide
author img

By

Published : Feb 25, 2022, 12:36 PM IST

BOY SUICIDE IN ODISHA: ఈ మధ్యకాలంలో కొెందరు పిల్లలు.. అమ్మానాన్న ఫోన్​ కొనివ్వడం లేదనో.. కాస్త మందలించారనో.. ఇలా చాలా చిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒడిశాలోని బాలాసోర్​కు చెందిన 13 ఏళ్ల బాలుడు.. బిర్యానీ తీసుకురాలేదని ఆత్మహత్య చేసుకొని.. కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు.

అసలు ఏం జరిగిందంటే..?

ఒడిశాలోని బాలాసోర్​కు చెందిన మనోరంజన్​ మహన్న కుమారుడు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఆ బాలుడు బిర్యానీ తీసుకురమ్మని తండ్రికి చెబుతున్నాడు. అయితే మనోరంజన్​ బాలాసోర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం వల్ల బిజీగా ఉన్నారు. ఆయన ఖాళీ చేతులతో ఇంటికి రావడం చూసి బాలుడు నిరాశకు గురయ్యాడు. అనంతరం ఆ రోజు రాత్రే గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే చూసిన తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

బిర్యానీ కోసం ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని మనోరంజన్​ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు.. 55 అడుగుల లోతులో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.