ETV Bharat / bharat

ఒడిశా విద్యార్థి సూక్ష్మ కళాఖండం- అచ్చం పూరీ ఆలయంలాగే..

author img

By

Published : Aug 17, 2021, 2:49 PM IST

Updated : Aug 17, 2021, 3:02 PM IST

ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి అద్భుత సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించాడు. కలపతో మినీ పూరీ జగన్నాథ ఆలయాన్ని తయారు చేశాడు. దీన్ని చూసిన వారు విద్యార్థి నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.

miniature wooden replica of puri
పూరీ ఆలయం సూక్ష్మ కళాఖండం

ఒడిశాలోని గంజమ్​ జిల్లాకు చెందిన దిలీప్​ మోహారాణా చేతులు అద్భుతాన్ని చేశాయి. కలపతో పూరీ జగన్నాథ ఆలయ మినియేచర్​ను రూపొందించి వారెవ్వా అనిపించాడు. కేవలం 45 రోజుల్లోనే ఈ సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించాడు.

puri jagannath temple art
పూరీ ఆలయం సూక్ష్మ కళాఖండం

దిలీప్​ మోహారాణా కుటుంబం బెహ్రంపూర్​ నుంచి వలస వచ్చి ఒడిశాలోని గంజమ్ జిల్లాలో నివసిస్తున్నారు. అతడు బీకామ్​ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. లాక్​డౌన్ సమయంలో ఇంటి వద్దే ఉండగా.. ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకున్నాడు. పూరీ ఆలయ కళాఖండానికి శ్రీకారం చుట్టాడు. 5.5 అంగుళాల ఎత్తు, 12 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉన్న చెక్క ప్రతిరూపాన్ని తయారు చేశాడు. ఆలయంలో గోపురాలు, దేవతా ప్రతిమల ఆకారాలు అచ్చుగుద్దినట్టుగా తీర్చిదిద్దాడు. కళాఖండంలో దాదాపు పది గుళ్లు వచ్చేలా ఓ మినీ పూరీని కళ్లకు కట్టినట్లుగా తయారు చేశాడు.

puri jagannath temple art
ఒడిశా విద్యార్థి సూక్ష్మ కళాఖండం

గతంలోనూ రాముని గుడి, దుర్గ దేవతల సూక్ష్మ ప్రతిరూపాలను తయరు చేశాడు మోహారాణా. ఇందుకుగాను గ్రాండ్ మాస్టర్​ ఆఫ్ ఇండియా, ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​కు బహుమతిగా ఇవ్వడానికి ప్రస్తుతం రెండు పూరీ కళాఖండాలను తయారు చేసినట్లు చెప్పాడు.

puri jagannath temple art
దిలీప్​ మోహారాణా

ఇదీ చదవండి:'జగన్నాథుడి'పై కళాకృతులు.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం

ఐస్​క్రీమ్​ పుల్లలతో ఒలింపిక్స్ స్టేడియం.. చూసేయండి!

Last Updated : Aug 17, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.