ETV Bharat / bharat

ఆక్సిజన్​ సిలిండర్ల వ్యానులో రూ.కోటి విలువైన గంజాయి

author img

By

Published : Jun 12, 2021, 9:57 PM IST

Updated : Jun 12, 2021, 10:21 PM IST

పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంటున్నారు గంజాయి సరఫరాదారులు. ఆక్సిజన్​ సిలిండర్లను తనిఖీ చేయరని నమ్మి పోలీసులకు చిక్కారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి దిల్లీ వెళుతున్న వాహనంలో గంజాయి రవాణా చేసి ఒడిశాలో పట్టుబడ్డారు.

Ganja
గంజాయి పట్టివేత

ఒడిశాలోని కొరాపుత్​ జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ వెళ్లే ఆక్సిజన్​ సిలిండర్​ల వాహనంలో 1,277 కిలోల గంజాయిని ఉత్తర్​ప్రదేశ్​కు తరలించేందుకు ప్రయత్నించగా కొరాపుత్​లో పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. కోటి పది లక్షల వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో పంజాబ్​ లూథియానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

"ఆక్సిజన్​ సిలిండర్​లను ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నౌకాశ్రయంలో​ లోడ్​ చేసుకున్నారు. దిల్లీ తరలించే క్రమంలో ఒడిశాలోని కొరాపుత్​లో గంజాయిని వాహనంలోకి ఎక్కించారు. దానిని ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో డెలివరీ చేసేందుకు ప్రణాళిక రచించారు. ఒడిశా కొరాపుత్​ జిల్లాలోని జయ​పుర్ ఘాట్ రోడ్‌లో వెళుతున్న క్రమంలో ట్రక్కును పట్టుకున్నా. "

- ఆదిత్య మహాకుర్​, జయ​పుర్​ సదర్​ స్టేషన్​ అధికారి.

ఈ తరలింపుకు సంబంధించి స్థానిక సరఫరాదారులను గుర్తించేందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని మహాకుర్​ తెలిపారు.

ఇదీ చూడండి: Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!

Last Updated : Jun 12, 2021, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.