ETV Bharat / bharat

నడిరోడ్డుపై నర్సును కత్తితో పొడిచి హత్య​.. వెబ్​సిరీస్​ చూసి వ్యాపార దంపతులను చంపేసి.. - చోరీకి వచ్చి భార్యాభర్తల హత్య

Nurse Stabbed To Death In Patna : పట్టపగలు నడిరోడ్డుపై ఓ నర్సును పలు మార్లు కత్తితో పొడిచి హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన బిహార్​లోని పట్నాలో జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో ఇంట్లో చోరీకి వచ్చిన ఇద్దరు యువకులు ప్రతిఘటించిన దంపతులను దారుణంగా హత్య చేశారు.

Nurse Stabbed To Death In Patna
Nurse Stabbed To Death In Patna
author img

By

Published : Aug 12, 2023, 10:34 PM IST

Updated : Aug 12, 2023, 10:40 PM IST

Nurse Stabbed To Death In Patna : బిహార్​.. పట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ కత్తితో పొడిచి ఓ నర్సును దారుణంగా హత్య చేశాడో దుండగుడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణియా జిల్లాకు చెందిన సోని కుమారి అనే 25 ఏళ్ల మహిళ పట్నాలోని కంకర్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మేదాంత ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. నిందితుడు.. సోనితోపాటు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇద్దరి మధ్య ఏదో గొడవ తలెత్తింది. అనంతరం నిందితుడు కత్తితో మహిళపై దాడి చేశాడు. పొట్ట, ఛాతీ భాగంలో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే నిందితుడి వయసు 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు కంకర్​బాక్​ ఇన్​ఛార్జి రవిశంకర్ తెలిపారు. బాధితురాలికి నిందితుడు పరిచయం ఉన్నాడని వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే హత్యకు గల కారణం తెలుస్తుందన్నారు. ప్రస్తుతం తాము సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చోరీకి వచ్చి దంపతుల హత్య..
ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో ఓ ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు.. ప్రతిఘటించిన దంపతులను హత్య చేశారు. ఓ వెబ్​సిరీస్​ ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు.. పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగిందంటే?.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేరఠ్​లో వ్యాపారవేత్త ధన్‌కుమార్‌ జైన్‌(70).. తన భార్య అంజు జైన్‌(65)తో నివసిస్తున్నారు. గురువారం రాత్రి.. ఇద్దరు యువకులు వారి ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. ఆ సమయంలో ధన్​కుమార్​ దంపతులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో నిందితులు వారిపై దాడి చేశారు. అనంతరం డబ్బు, నగలతో పరారయ్యారు. తీవ్ర గాయాలతో ధన్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన భార్య మృతి చెందారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారాంగా ఇద్దరినీ అరెస్ట్​ చేశారు. వారిని ప్రియాంక్‌ శర్మ(25), యశ్‌ శర్మ(24)గా గుర్తించారు. దొంగలించిన సొమ్ము, బైక్​, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాము ఓ వెబ్‌సిరీస్‌ చూసి ఇదంతా చేశామని నిందితులు.. చెప్పారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యూట్యూబ్‌లో మార్గాలను కూడా వెతికినట్లు నిందితులు తెలిపారు.

ముగ్గురు పిల్లల తల్లితో సంబంధం.. పెళ్లి చేసుకోమందని 35సార్లు కత్తితో పొడిచి హత్య

'నన్ను ప్రేమించి.. మరో వ్యక్తితో పెళ్లా?'.. 16 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రియుడు

Last Updated : Aug 12, 2023, 10:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.