NRI Built School Building With Own Money : ఆ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివాడు. ఓనమాలు అక్కడే నేర్చాడు. మంచిగా చదివి వైద్యుడై అమెరికాలో స్థిరపడ్డాడు. అయితే చదువుకున్న పాఠశాలను, చిన్ననాటి స్నేహితులను మరవలేదు కర్ణాటక మైసూరుకు చెందిన సచ్చిదానంద మూర్తి. ఓసారి తన స్నేహితుల ద్వారా గడి చౌక్‌లోని తాను విద్య నేర్చిన పాఠశాల పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఈ పాఠశాలను ఎలా అయినా బాగు చేయించి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా స్నేహితులను స్కూల్‌కు పంపించి విచారణ చేయించాడు.
అంతా పరిశీలించి పాఠశాలను ఆధునీకరించేందుకు 18 లక్షల ఖర్చు అవుతుందని ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ చెప్పారు. అయితే దానికన్నా కొత్త భవంతిని కట్టిస్తేనే బాగుంటుందని సచ్చిదానంద మూర్తి భావించారు. ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుని ఉన్న చోటే కొత్త భవంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
"డాక్టర్ సచ్చిదానంద మూర్తి ఈ స్కూల్లో 1958లో చదువుకున్నారు. అతడి పాత మిత్రులు స్కూల్ రికార్డుల కోసం వచ్చారు. వెంటనే మేం డాక్యుమెంట్లు పంపించాం. తర్వాత స్కూల్ కండీషన్ గురించి అడిగారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని చెప్పాం. కొత్త భవనం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలన్నారు. రెండంతస్తుల భవనం నిర్మిస్తామని చెప్పారు. ఉన్నతాధికారులను కలిసి బ్లూప్రింట్ తయారు చేశాం. పాత భవనాన్ని కూల్చేసి అదే ప్రాంతంలో కొత్త పాఠశాల బిల్డింగ్ నిర్మించారు."
-రవి కుమార్, పాఠశాల హెడ్మాస్టర్
రూ.కోటీ 50 లక్షల ఖర్చుతో అన్ని హంగులతో పాఠశాల భవంతి సిద్ధం అయింది. ఇందులో కంప్యూటర్ రూం, లైబ్రరీ, 300 మంది కూర్చునేలా ఆడిటోరియం, డైనింగ్ రూంలు ఉండేలా రెండంతస్తుల భవనం రూపుదిద్దుకుంది. ఈ పాఠశాల భవనాన్ని వచ్చే నెలలో కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ప్రారంభిస్తారు.
ఈ స్కూల్‌కు ఘన చరిత్రే ఉంది. 1918లో ఈ పాఠశాల ప్రారంభమైంది. అప్పటి మైసూరు పాలకుడైన నలవది కృష్ణరాజ వొడెయార్ ఈ స్కూల్‌ను ప్రారంభించారు.
రూ.కోటి విరాళాలతో కొత్త స్కూల్ బిల్డింగ్
ఇటీవల కర్ణాటకలో రూ.కోటికి పైగా విరాళాలతో పూర్వవిద్యార్థులంతా కలిసి తమ పాఠశాలకు పునర్వైభవం తెచ్చారు. 135 ఏళ్ల చరిత్ర ఉన్న తమ పాఠశాల కూలిపోయే స్థితికి చేరిపోయిన నేపథ్యంలో అంతా కలిసి చందాలు వేసుకొని కొత్త భవనం నిర్మించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
రాజ్యాంగ వర్ణమాలతో మురికివాడల పిల్లలకు పాఠాలు- ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు లాయర్ కృషి
'అమ్మా మీ పిల్లలను స్కూల్‌కు పంపండి ప్లీజ్' రోజూ గ్రామంలోని ఇంటింటికీ వెళ్తున్న టీచర్లు!
KTR School in konapur : నాయనమ్మకు ప్రేమతో.. రెండున్నర కోట్ల సొంత ఖర్చులతో స్కూల్