ETV Bharat / bharat

పవార్​- ఫడణవీస్​ భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు - శరద్​ పవార్​ ఆరోగ్యం

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ మధ్య జరిగిన భేటీలో రహస్యం ఏమీ లేదని శివసేన వ్యాఖ్యానించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పవార్​ను తరుచూ కలుస్తూనే ఉంటారని పేర్కొంది.

Sharad Pawar, Fadnavis
పవార్​, ఫడణవీస్​
author img

By

Published : Jun 2, 2021, 6:15 PM IST

ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ మధ్య ఇటీవల జరిగిన భేటీపై శివసేన విభిన్నంగా స్పందించింది. 'అందులో అర్థంకాని రహస్యమేం లేదు' అని ఆ పార్టీకి చెందిన 'సామ్నా' పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవార్​ను వివిధ సందర్భాల్లో కలుస్తూనే ఉంటారని చెప్పింది.

మహారాష్ట్రలో భాజపా 'ఆపరేషన్​ కమల్​'లో భాగంగా.. కొత్త కూటములు ఏర్పడతాయని వినిపిస్తున్న ఊహాగానాలను 'సామ్నా' సంపాదకీయం తోసిపుచ్చింది.

"ఫడణవీస్​కు, శరద్​పవార్​కు మధ్య జరిగిన భేటీలో రహస్యం ఏమీ లేదు. అలా భావిస్తున్న వారి గురించి మాకు తెలియదు."

-శివసేన

సోమవారం ఉదయం ముంబయిలోని శరద్​ పవార్​ నివాసంలో ఆయనను ఫడణవీస్​ కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగానే తాను పవార్​ను కలిశానని ఈ భేటీ అనంతరం ఫడణవీస్​ తెలిపారు.

ఇదీ చూడండి: 'ప్రతిపక్షాల ఐక్యతకు పవార్​ కృషి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.