ETV Bharat / bharat

ప్రమోషన్ కోసం పొలిటికల్ లీడర్ల ఫోన్ కాల్స్.. చివరికి ఉద్యోగం నుంచి ఔట్! - నార్త్ సెంట్రల్​ రైల్వే లేటెస్ట్ న్యూస్

రాజకీయ నాయకుల సిపార్సు కారణంగా ఓ మహిళా రైల్వే ఉద్యోగి.. ఉద్యోగం కోల్పోయింది. అందరిలాగే రాజకీయ నాయకుల పరపతిని వాడుకొని ఉద్యోగంలో ఓ మెట్టు పైకి ఎక్కాలనుకున్న ఆమెకు షాక్ తగిలింది. ఇంతకీ ఈ కథేంటంటే...

railway employee suspended
railway employee suspended
author img

By

Published : Jun 8, 2023, 4:13 PM IST

రాజకీయ నాయకుల కారణంగా రైల్వే శాఖలో ఉద్యోగాన్ని కోల్పోయింది ఓ మహిళ. ఆగ్రా రైల్వే డివిజన్​లో హెల్పర్​ ఉద్యోగం చేస్తున్న ఆమె.. ఆఫీస్​లో ఉద్యోగం కావాలంటూ ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో చేసిన ప్రయత్నాలను అధికారులు తోసిపుచ్చారు. ఆమె రైల్వే సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించించారంటూ విచారణలో తేలిందని స్పష్టం చేశారు. దీంతో తక్షణమే ఉద్యోగంలో పూజా కుమారి అనే రైల్వే ఉద్యోగినిని తొలగిస్తున్నట్లు ఆగ్రా డివిజనల్​ రైల్వే పీఆర్​వో ప్రశస్తి శ్రీవాత్సవ ప్రకటించారు.

ఆగ్రా రైల్వే డివిజన్​లో హెల్పర్​గా గత పదేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నారు పూజా కుమారి అనే మహిళ. ప్రస్తుతం తాను చేస్తున్న ఉద్యోగం కష్టంగా ఉందంటూ.. తనను ఆఫీస్​ విధుల్లోకి తీసుకోవాలని పలుమార్లు ఉన్నత అధికారులకు పూజా దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అలా చేయలేమంటూ అధికారులు ఆమెకు సమాధానం ఇచ్చారు. దీంతో పూజా మరో అడుగు ముందుకేసి.. తనకు పరిచయస్థులైన రాజకీయ నాయకుల ద్వారా రైల్వే అధికారులకు ఫోన్ చేసింది. ఆఫీసు విధుల్లోకి తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చింది. రైల్వే సర్వీస్ రూల్స్​ ప్రకారం.. ఏ ఉద్యోగి అయినా తమ సర్వీసు విషయంలోగానీ, ప్రమోషన్​ విషయంలోగానీ ఎటువంటి రాజకీయ ఇతర పలుకుబడి ఉపయోగించరాదని అధికారులు స్పష్టం చేశారు. రైల్వే సర్వీస్ క్రమశిక్షణ ఉల్లఘింగించినందుకు (రైల్వే యాక్ట్​ 1968 కింద) పూజా కుమారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

మూడో భార్య ఉందనే విషయం దాచినందుకు..
కొన్నాళ్ల క్రితం.. మూడో భార్య ఉందనే విషయం చెప్పకుండా దాటినందుకు ఓ వ్యక్తి ఉద్యోగాన్నే కోల్పోయే పరిస్థితి వచ్చింది. మధ్యప్రదేశ్​లోని సింగ్​రౌలి జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎన్నికల అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అతడి ముగ్గురు భార్యలు.. ఎన్నికల్లో పోటీ చేయడమే అందుకు కారణం. నిబంధనల ప్రకారం.. అధికారులకు ముగ్గురు భార్యల వివరాలు ఇవ్వాల్సి ఉండగా.. అతడు ఇద్దరి సమాచారం మాత్రమే ఇచ్చాడు. మూడో భార్య గురించి మాత్రం బయటపెట్టలేదు. దీంతో ఎన్నికల అధికారి అది గుర్తించి చర్యలు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్​లో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందులో పోటీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల వివరాలను అధికారులు అందించమన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సుఖ్​రామ్​ సింగ్​ ముగ్గురు భార్యలు నామినేషన్లను దాఖలు చేశారు. ముగ్గురూ.. భర్త పేరు దగ్గర సుఖ్​రామ్​సింగ్​ అనే రాశారు. అయితే అతడు మాత్రం అధికారులకు కుసుకలి సింగ్​, గీతా సింగ్​ వివరాలు మాత్రమే అందించాడు. తన మూడో భార్య అయిన ఊర్మిళా సింగ్​ గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో అది గుర్తించిన అధికారులు.. అతడిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేపట్టారు. సస్పెండ్​ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.