ETV Bharat / bharat

5-12 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకాపై ట్విస్ట్! - 5-12 పిల్లలకు టీకా

5-12 ఏళ్ల వయసు చిన్నారులకు టీకా పంపిణీపై శుక్రవారం జరిగిన సమావేశంలో సాంకేతిక సలహా బృందం (ఎన్​టీఏజీఐ) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు 12-17 ఏళ్ల వయసు మధ్య వారికి సీరం సంస్థ రూపొందించిన కొవొవాక్స్‌ టీకాకు ఎన్​టీఏజీఐ ఆమోదం తెలిపింది.

vaccine
vaccine
author img

By

Published : Apr 29, 2022, 7:20 PM IST

5-12 Years Covid Vaccine: దేశంలోని 5-12 ఏళ్ల వయసు గల చిన్నారులకు కరోనా టీకా పంపిణీపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అంతకుముందు.. పిల్లలకు టీకా పంపిణీపై కేంద్రం శుక్రవారం ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. టీకా పంపిణీపై ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా బృందం(ఎన్​టీఏజీఐ) శుక్రవారం నిర్వహించే సమావేశంలో సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఐదేళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు.

మరోవైపు 12-17 ఏళ్ల వయసు మధ్య వారికి సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా రూపొందించిన కొవొవాక్స్​ టీకాకు ఎన్​టీఏజీఐ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే సీరం సంస్థ 18 ఏళ్లుపైబడిన వారికి టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

5-12 ఏళ్ల చిన్నారుల కోసం 'బయోలాజికల్ ఇ' తయారు చేసిన కొవిడ్ టీకా కార్బెవాక్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మంగళవారమే ఈ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ టీకాను 12-14 ఏళ్ల వయసు పిల్లలకు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ చిన్నారుల టీకాకు సైతం ఇదివరకు అత్యవసర అనుమతులు లభించాయి. ఈ టీకాను 6 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలకు వేయవచ్చు.

ఇదీ చూడండి : దండలు మార్చుకున్నారు.. కాసేపట్లో మూడు ముళ్లు.. ఇంతలోనే వధువును కాల్చి చంపి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.