2021 బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. నేడు రాజ్యసభలో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ వర్గాలు స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 1న 2021-22 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే... రాజ్యసభ బడ్జెట్ సమావేశాల తొలి భాగం ఫిబ్రవరి 13న ముగియనున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ శుక్రవారమే మాట్లాడనున్నారు.
రెండో విడతలో భాగంగా.. మార్చి 8న రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
ఇవీ చదవండి: