పంజాబ్‌లో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ తరుణంలో లుథియానా జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ విధించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మార్చి 12 నుంచి ఇది అమలవుతుందని పేర్కొన్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు పక్కాగా ఈ కర్ఫ్యూ విధిస్తామని తెలిపారు.
పోలీసులు, ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సేవలు అందించే వారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
పటియాలాలోనూ..
పటియాలా జిల్లాలోనూ రాత్రి కర్ఫ్యూ అమలుచేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.
ఒక్కరోజే 1300 కేసులు
పంజాబ్‌లో గురువారం 1,309 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసులు సంఖ్య 1,93,345కు చేరింది. 5,996 మంది వైరస్‌కు బలయ్యారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది.
ఇదీ చదవండి:వైభవంగా 'ఈశా ఫౌండేషన్' మహాశివరాత్రి వేడుకలు