ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఐసిస్)లో చేరిన 14 మంది కేరళ యువకుల కేసులో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. నషీదుల్ హమ్జాఫర్ (NIA ISIS Kerala) అనే నిందితుడిని దోషిగా తేల్చింది. కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగిన విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ తీర్పును (NIA ISIS Kerala) వెల్లడించింది. దోషికి విధించే శిక్షపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.
కాసరగోడ్ జిల్లాకు చెందిన నషీదుల్ హమ్జాఫర్ .. రషీద్ అబ్దుల్లా, అష్ఫక్ మజీద్ సహా పలువురు నిందితులతో (NIA ISIS Kerala) 2017 అక్టోబరు 3న విదేశాలకు వెళ్లిన హమ్జాఫర్ కాబుల్లో పట్టుబడ్డాడు. 2018 సెప్టెంబరులో ఎన్ఐఏ హమ్జాఫర్ను అరెస్ట్ చేసి భారత్కు తీసుకువచ్చింది.
బెంగళూరులో..
మరోవైపు, ఐఎస్ఐఎస్తో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జుహబ్ హమీద్ షకీల్ మన్నా (32) అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న మిగతా నిందితులతో కలిసి సంస్థకు విరాళాలు సేకరించేవాడని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఓ మతానికి చెందిన యువకులను ఐఎస్ఐఎస్లో చేరే విధంగా ప్రేరేపించి, వారిని సిరియాకు తరలించేవాడని తెలిపారు.
ఇదీ చూడండి : దేశంలోనే తొలి ఆహార మ్యూజియం.. అందరికీ అవగాహనే లక్ష్యం!