జమ్ముకశ్మీర్లో (jammu kashmir news) స్థానిక, స్థానికేతరుల మీద జరిగిన హింసాత్మాక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. సుమారు 11 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా శ్రీనగర్, బారాముల్లా, అవంతిపుర, సోపుర్, కుల్గాంలలో సోదాలు చేపట్టింది.
బృందాలుగా విడిపోయిన అధికారులు బారాముల్లా జిల్లాలోని ఫతేగఢ్, నార్వాలోని అడోరా గ్రామాల్లో సోదాలు చేపట్టారు. ఫతేగఢ్లోని షేక్ అష్రఫ్ మంజూర్, అడోరాలోని హురియత్ జీ నాయకుడు అబ్దుల్ రషీద్ ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: కశ్మీర్లో పౌరుల హత్యలపై ఎన్ఐఏ దర్యాప్తు