ETV Bharat / bharat

ఐఎస్‌ఐఎస్‌ కుట్ర భగ్నం- ఐదుగురు అరెస్ట్​ - ఐఎస్​ఐఎస్​

ఐఎస్​ఐఎస్​ ప్రచారానికి సంబంధించి ఎన్​ఐఏ ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఆన్‌లైన్‌లో నెలకోమారు ప్రచురితమయ్యే.. 'ద వాయిస్‌ ఆఫ్‌ హింద్‌'లో దోషపూరితమైన కథనాలు ప్రచురితమైనట్లు గుర్తించింది. ఆదివారం నాటి సోదాల్లో భారీ ఎత్తున ఉగ్రవాద సాహిత్యంతో నిండిన పత్రాలు, ట్యాబ్​ సహా పలు వస్తువులు లభించినట్లు అధికారులు వెల్లడించారు.

isis india, ఐఎస్​ఐఎస్​ తీవ్రవాదం ఎన్​ఐఏ
ఐఎస్‌ఐఎస్‌ ముఠా గుట్టురట్టు
author img

By

Published : Jul 12, 2021, 8:30 AM IST

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌ ముఠా (మాడ్యుల్‌) గుట్టును రట్టుచేసింది. సోదాల్లో భాగంగా తొమ్మిది మంది అనుమానితులను ప్రశ్నించింది. ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. భారత్‌పై హింసాత్మక జిహాద్‌ ప్రకటించేందుకు.. దేశంలోని సున్నిత మనస్కులైన యువతలో ఉగ్రవాద భావాలు చొప్పించడం, వారిని ఉగ్రవాదం వైప ఆకర్షితులను చేసేందుకు ఐఎస్‌ఐఎస్‌ కుట్ర ఘటనలకు సంబంధించి జూన్‌ 29న కేసు నమోదైనట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఆదివారం తెలిపారు. ఆన్‌లైన్‌లో నెలకోమారు ప్రచురితమయ్యే.. 'ద వాయిస్‌ ఆఫ్‌ హింద్‌'లో దోషపూరితమైన కథనాలు ప్రచురితమైనట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

భారత్‌లో అన్యాయం జరిగిపోతోందంటూ అసత్య కథనాలు, యువతలో తాము స్వదేశంలోనే పరాయివారమన్న భావన కలిగించేలా, మతపరమైన విద్వేషాన్ని పెంచేలా ఉండే కథనాలు 'ద వాయిస్‌ ఆఫ్‌ హింద్‌' ప్రచురించేది. ఇందుకోసం చేపట్టిన ఆన్‌లైన్‌ ప్రచారానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారి నుంచి నిధులు అందేవి. ఆదివారం నాటి సోదాల్లో భారీ ఎత్తున ఉగ్రవాద సాహిత్యంతో నిండిన పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్​డిస్క్​లు, ఐఎస్​ఐఎస్​ చిహ్నం ముద్రించిన దుస్తులు లభించినట్లు ఎన్​ఐఏ ప్రతినిధులు తెలిపారు. ఈ సోదాల్లో ఎన్​ఐఏకు నిఘా విభాగం (ఐబీ), రీసెర్చ్​, అనాలసిస్​ వింగ్​ (రా)లు సహకరించాయి.

లఖ్​నవూలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్​

అల్‌ఖైదా మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అన్సర్‌ ఘాజ్వతుల్ హింద్​కు చెందిన ఇద్దరు​ ఉగ్రవాదులను ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్​నవూ శివారులో ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 'పేలుడు పదార్థాలను నైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లఖ్‌నవూ నగరానికి చెందిన మిన్హాజ్‌ అహ్మద్‌, మసీరుద్దీన్‌లను ఉత్తర్‌ప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) అదుపులోకి తీసుకుంది. అరెస్ట్​ అయిన ఉగ్రవాదులు ఆగస్ట్‌ 15న లఖ్‌నవూ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు, మానవ బాంబులతో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు యూపీ అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ప్రకాశ్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. అన్సర్‌ ఘాజ్వతుల్​ హింద్​ ప్రతినిధులు లఖ్​నవూతో పాటు కాన్పూర్​లో ఉన్నట్లు ఆయన వివరించారు. మిన్హాజ్​ అహ్మద్​, మసీరుద్దీన్​లు అనుచరులను పట్టుకునేందుకు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కోల్​కతాలో ముగ్గురు..

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆదివారం పోలీసులు జమాతుల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్​ అయిన ముగ్గురూ బంగ్లాదేశ్‌ పౌరులని, నకిలీ ధ్రువపత్రాలతో ఈ ఏడాది జనవరి నెలలో భారత్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. వీరు ఠాకుర్‌పుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ గది తీసుకుని కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నట్లు వివరించారు. అరెస్టు అయిన ఉగ్రవాదులను నజీ ఉర్‌ రహమాన్‌, రబీయుల్‌ ఇస్లాం, సబీర్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి జిహాదీ సాహిత్యం, జేఎంబీ అగ్రనేతల జాబితాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి : పిడుగుల బీభత్సం-28 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.