మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న మహావికాస్ అఘాడీ సర్కారు పడిపోయిన వెంటెనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సరైన సమయంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు.
2019 మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంగళవారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఫడణవీస్ తాజా ప్రకటన చేశారు. అయితే, అనూహ్య పరిణామాలు.. సభలో మెజారిటీ లేని కారణంగా 80 గంటలకే ఫడణవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
భాజపాదే అధికారం..
రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో సమన్వయం లేదని కేంద్ర సహాయ మంత్రి రావ్‌సాహెబ్ ధన్వే అన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో భాజపా అధికారంలోకి వస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్బణిలో ఈ వ్యాఖ్యలు చేశారు ధన్వే.
ఇదీ చూడండి: తేజ్ బహదూర్ కేసులో సుప్రీం తీర్పు నేడు