కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం చేసిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్రం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ప్రతిపాదనలు తెలియజేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం.. కొవిడ్ బారి నుంచి కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా అందించాల్సి ఉంటుందని వెల్లడించింది.
కమిటీ ప్రతిపాదనలు..
- టీకా తొలి డోసు తీసుకున్నాక వైరస్ బారిన పడితే.. కోలుకున్నాక రెండో డోసు కోసం మూడు నెలలు ఆగాల్సిందే.
- ఇతర సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరటం లేదా ఐసీయూ అవసరమైన వారు సైతం టీకా కోసం 4-8 వారాలు వేచి చూడాలి.
- వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు
- ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు
- వ్యాక్సినేషన్‌కు ముందు కరోనా నిర్ధరణ పరీక్షలు అవసరం లేదు
- పాలిచ్చే తల్లులకు టీకా ఇవ్వొచ్చు
ఇదీ చూడండి: 'భారత్‌లో 13% తగ్గిన కరోనా కేసులు.. కానీ..'