ETV Bharat / bharat

దోషుల్ని కచ్చితంగా శిక్షిస్తాం: నెతన్యాహుకు మోదీ హామీ

ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయంపై దాడి చేసిన వారిని పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని ఆ దేశ ప్రధానికి హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరు కొనసాగించాలని నిర్ణయించారు.

Netanyahu thanks Modi for safeguarding Israeli diplomats
దోషుల్ని కచ్చితంగా శిక్షిస్తాం: నెతన్యాహుకు మోదీ హామీ
author img

By

Published : Feb 2, 2021, 5:35 AM IST

జనవరి 29న భారత్​లోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి బాధ్యులను శిక్షిస్తామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుకు హామీ ఇచ్చారు. ఇజ్రాయిలీ ప్రతినిధులను రక్షించేందుకు కృషిచేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నెతన్యాహు.

Netanyahu thanks Modi for safeguarding Israeli diplomats
నెతన్యాహు ట్వీట్​

ఇజ్రాయెల్​ దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయ భద్రతకు భారత్​ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. నెతన్యాహూతో మోదీ ఫోన్​లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

మోదీ ట్వీట్​

ఈ దాడి ఘటనలో భారత్​, ఇజ్రాయెల్​ భద్రతా సంస్థల మధ్య సమన్వయం పట్ల ఇరువురు దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కరోనా మహమ్మారిపైనా ఉమ్మడి పోరు కొనసాగించాలని నిర్ణయించారని వెల్లడించింది.

ఇదీ చూడండి: బాంబు పేలుడుపై ఇజ్రాయెల్​ మంత్రికి జైశంకర్ ఫోన్​​​

జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం సమీపంలో చిన్న పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్​ రాయబారులే లక్ష్యంగా ఇరాన్​ ఈ దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి:

'దిల్లీ 'పేలుడు' ఘటన మా పనే'

ఇజ్రాయెల్​పై ప్రతీకారంతోనే దిల్లీలో పేలుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.