Cat swallow Needle UP: చిన్నపిల్లలు రూపాయి బిళ్లలను మింగడం.. గొంతులో చేప ముల్లు ఇరుక్కోవడం వంటి ఘటనలు తరచుగా మనం వినే ఉంటాం. కానీ, యూపీలో ఓ పిల్లి ఏకంగా సూదిని మింగేసింది. అది దాని గొంతులో అడ్డం పడింది. దీంతో పిల్లికి తినడం, తాగడం కష్టమైపోయింది. ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో ఈఘటన జరిగింది.
పిల్లి గొంతు నొప్పితో బాధపడుతోందని దాని యజమాని భావించాడు. ఏమీ తినకపోయే సరికి వెటర్నరీ సర్జన్ డాక్టర్ విక్రమ్ వర్ష్నీ వద్దకు తీసుకెళ్లాడు. సాధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏమీ తేలలేదు. దీంతో ఎక్స్‌రే తీయించాలని నిర్ణయించారు. పిల్లి గొంతులో సూది ఇరుక్కుపోయిన విషయం ఎక్స్‌రేలో తేలింది.
![needle-thread-stuck-in-cat-throat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ali-05-needle-thread-stuck-in-cat-neck-vis-byte-up10134_20062022172325_2006f_1655726005_1092.jpg)
![needle-thread-stuck-in-cat-throat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ali-05-needle-thread-stuck-in-cat-neck-vis-byte-up10134_20062022172325_2006f_1655726005_23.jpg)
రెండు గంటల సర్జరీ..
వైద్యుడు అత్యంత జాగ్రత్తగా పిల్లికి సర్జరీ నిర్వహించారు. రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి సూదిని బయటకు తీశారు. సూదితో పాటు దానికి కట్టి ఉన్న దారం కూడా బయటకు వచ్చింది. పిల్లికి ఎలాంటి హాని లేదని వైద్యులు స్పష్టం చేశారు. సర్జరీ తర్వాత పిల్లి తినడం, తాగడం ప్రారంభించింది.
![needle-thread-stuck-in-cat-throat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ali-05-needle-thread-stuck-in-cat-neck-vis-byte-up10134_20062022172325_2006f_1655726005_222.jpg)
![needle-thread-stuck-in-cat-throat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ali-05-needle-thread-stuck-in-cat-neck-vis-byte-up10134_20062022172325_2006f_1655726005_914.jpg)
పెంపుడు జంతువులను పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యుడు విక్రమ్ చెబుతున్నారు. 'ఇలాంటి చిన్న వస్తువులను వాటికి దూరంగా ఉంచాలి. అదృష్టవశాత్తు పిల్లికి ఏం జరగలేదు. కొన్నిసార్లు కడుపులోకి ప్రమాదకరమైన వస్తువులు వెళ్తుంటాయి. కాబట్టి యజమానులు కాస్త జాగ్రత్తగా ఉండాలి' అని వైద్యుడు సలహా ఇస్తున్నారు.
![needle-thread-stuck-in-cat-throat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ali-05-needle-thread-stuck-in-cat-neck-vis-byte-up10134_20062022172325_2006f_1655726005_460.jpg)
ఇదీ చదవండి: