ETV Bharat / bharat

'పర్యావరణ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు అవసరం'

వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారీస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయంలో భారత్​ తన వంతు పాత్ర నిర్వహిస్తోందన్నారు. అమెరికా ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్​ సమావేశానికి మోదీ హాజరయ్యారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Apr 22, 2021, 7:28 PM IST

పర్యావరణ పరిరక్షణకు అత్యంత వేగంగా, భారీ స్థాయిలో పటిష్ఠమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాతావరణ సంక్షోభంపై అమెరికా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వర్చువల్​గా హాజరయ్యారు మోదీ. ఈ సందర్భంగా పర్యావరణ మార్పులపై ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ముందడుగు వేసినందుకు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​కు కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ మార్పులతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు భారత్​ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

climate change meet
వర్చువల్​గా హాజరైన వివిధ దేశాధినేతలు

" వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన చర్యలు అవసరం. అత్యంత వేగంగా, భారీ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆ చర్యలు ఉండాలి. అభివృద్ధి సవాళ్లు ఉన్నప్పటికీ, క్లీన్​ ఎనర్జీ, దాని సామర్థ్యం పెంపు, జీవ వైవిధ్యం కోసం ఎన్నో సాహసోపేతమైన చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం మానవ సమాజం మహమ్మారితో పోరాడుతోంది. వాతావరణ మార్పులతో ఎదురయ్యే తీవ్రమైన ముప్పు తప్పిపోలేదని ప్రస్తుత తరుణంలో ఈ భేటీ గుర్తు చేస్తోంది.

ఒక పర్యావరణ పరిరక్షణ దేశంగా.. భారత్​ తమ భాగస్వామ్య దేశాలు ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు స్వాగతిస్తోంది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో మన జీవన శైలిని మార్చుకోవటం చాలా ముఖ్యం. కొవిడ్​ అనంతరం మన ఆర్థిక వ్యూహానికి.. సుస్థిర జీవనశైలి, ప్రాథమిక సూత్రలు మూలస్తంభాలుగా ఉండాలి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

గ్లోబల్​ సగటుతో పోల్చితే.. భారత్​లోని తలసరి కార్బన ఉద్గారాలు 60 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తు చేశారు మోదీ. భారత్​లో జీవన విధానం సంప్రదాయాలతో మమేకమై ఉండటమే అందుకు కారణంగా తెలిపారు. 'భారత్​-యూఎస్​​ క్లైమెట్​, క్లీన్​ ఎనర్జీ ఎజెండా-2030 పార్ట్నర్​షిప్​'ను బైడెన్​తో కలిసి ప్రారంభించినట్లు చెప్పారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు పెట్టుబడులు, ఇతర చర్యలను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశానికి 40 మంది వివిధ దేశాల నాయకులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: కరోనాతో తల్లి మృతి- బాధతో కుమార్తె ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.