ETV Bharat / bharat

శరద్​ పవార్​ శస్త్రచికిత్స విజయవంతం - శరద్ పవార్​కి సర్జరీ

ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​కు గాల్​బ్లాడర్​ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్​ నేత, మంత్రి నవాబ్​ మాలిక్​ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

gall bladder operation to pawar
శరద్​ పవార్​కి చికిత్స
author img

By

Published : Apr 12, 2021, 1:13 PM IST

Updated : Apr 12, 2021, 2:31 PM IST

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​కు గాల్​బ్లాడర్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రి వైద్యులు సోమవారం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని స్పష్టం చేశారు.

''మా పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్​కి ఈ రోజు నిర్వహించిన లాప్రోస్కోపీ చికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా కోలుకుంటున్నారు.''

-నవాబ్​ మాలిక్​, మహారాష్ట్ర మంత్రి.

గత నెలలో కడుపునొప్పితో శరద్​ పవార్​ ఆసుపత్రిలో చేరారు. దాంతో మార్చి 30న ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆయన గాల్​బ్లాడర్​లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ రాళ్లను తొలగించారు. మరో 15రోజుల్లో గాల్​బ్లాడర్​ను శస్త్రచికిత్స చేసి తొలగించాలని వైద్యులు అప్పుడే చెప్పారు.

ఇవీ చదవండి: 'దేశంలో ప్రతి ఒక్కరికి టీకా అవసరం'​

కేంద్ర మంత్రి సంజీవ్​ బాల్యన్​కు కరోనా​

Last Updated : Apr 12, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.