ETV Bharat / bharat

రెచ్చిపోయిన మావోలు.. ఐదుగురు గ్రామస్థుల కిడ్నాప్ - నక్సలైట్లు

ఛత్తీస్​గఢ్ సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను నక్సల్స్ (Naxals in Chhattisgarh) అపహరించుకుపోయారు. ఓ మహిళ, నలుగురు పురుషులను కిడ్నాప్ చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థుల గురించి తమకు ఇంకా సమాచారం లేదని చెప్పారు.

naxals kidnap
నక్సల్స్ కిడ్నాప్
author img

By

Published : Nov 7, 2021, 9:38 PM IST

ఛత్తీస్‌గఢ్​లో మావోయిస్టులు (Naxals in Chhattisgarh) రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను అపహరించుకుపోయారు. శుక్రవారం నలుగురు, శనివారం మరో వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు.

వీరంతా కొంటా బ్లాక్​లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారని సుక్మా ఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. సెక్యూరిటీ హెడ్​క్వాటర్​కు ఈ గ్రామం 20 కిమీ దూరంలో ఉందని చెప్పారు. గ్రామస్థుల గురించి ఎలాంటి సమాచారం లేదని వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు (Naxals news) ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. కిడ్నాప్​పై వేగంగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

మరోవైపు, గ్రామస్థులను వదిలిపెట్టాలని సర్వా ఆదివాసీ సొసైటీ డిమాండ్ చేసింది. వారందరినీ సురక్షితంగా బయటపడేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి: సముద్రంలో పాక్​ కాల్పులు- భారతీయ జాలరి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.