ETV Bharat / bharat

అయోధ్య రామమందిర నిర్మాణంలో నవగ్రహ ప్రతిష్ఠ

అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా సోమవారం నవగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య నవగ్రహాలతో పాటు వెండి కలశాలను కూడా ప్రతిష్ఠించారు.

ayodhya's ram mandir
అయోధ్య రామమందిరం
author img

By

Published : May 18, 2021, 6:39 AM IST

అయోధ్యలో కొనసాగుతున్న శ్రీరామమందిర నిర్మాణంలో భాగంగా సోమవారం వేద మంత్రోచ్చారణల నడుమ నవగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వీటితో పాటు వెండి కలశాలను కూడా ప్రతిష్ఠించారు.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్​ మిశ్రా, మరికొంతమంది ముఖ్య అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పునాదులు 40 అడుగుల మేర తవ్వారు. ట్రస్ట్ సభ్యుల సమాచారం మేరకు.. రామజన్మభూమి కాంప్లెక్స్ నిర్మాణం 44 పలకలుగా చేపట్టిన పునాదుల నిర్మాణంలో రెండు పలకలు ఇప్పటికి పూర్తి చేశారు.

వర్షాకాలంలోపు ఈ పనులు పూర్తి చేసేందుకు కార్మికులు భారీ సంఖ్యలో నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

ఇదీ చదవండి : నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా జస్టిస్ యు.యు.లలిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.