Narendra Modi Pune Visit : విపక్ష కూటమిలో కీలక నేత ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర పుణెలో జరిగిన లోకమాన్య తిలక్ వర్ధంతి కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా 'ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్' (హింద్ స్వరాజ్ సంఘ్) అనే సంస్థ ప్రకటించిన లోక్మాన్య తిలక్ నేషనల్ అవార్డును అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే సహా కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్ వర్గం) నేతలు పాల్గొన్నారు. అంతకుముందు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు ప్రధాని మోదీ.
అవార్డు బహుమానాన్ని 'నమామీ గంగే' ప్రాజెక్ట్‌కు విరాళం
లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఈ అవార్డు ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీని నమామీ గంగే ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును 140 కోట్ల భారతీయులకు అంకింతం ఇస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత పుణెలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుణె మెట్రో ఫేజ్ 1లో పూర్తైన రెండు కారిడార్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
-
#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi flags off Metro trains marking inauguration of services on completed sections of the two corridors of Pune Metro Phase I and inaugurate and lay the foundation stone of various development projects at Shivaji Nagar Police… pic.twitter.com/nObaBQe2zG
— ANI (@ANI) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi flags off Metro trains marking inauguration of services on completed sections of the two corridors of Pune Metro Phase I and inaugurate and lay the foundation stone of various development projects at Shivaji Nagar Police… pic.twitter.com/nObaBQe2zG
— ANI (@ANI) August 1, 2023#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi flags off Metro trains marking inauguration of services on completed sections of the two corridors of Pune Metro Phase I and inaugurate and lay the foundation stone of various development projects at Shivaji Nagar Police… pic.twitter.com/nObaBQe2zG
— ANI (@ANI) August 1, 2023
-
PHOTO | PM Modi flags off metro trains marking inauguration of completed sections of Pune Metro. pic.twitter.com/aWQDqTB2TI
— Press Trust of India (@PTI_News) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PHOTO | PM Modi flags off metro trains marking inauguration of completed sections of Pune Metro. pic.twitter.com/aWQDqTB2TI
— Press Trust of India (@PTI_News) August 1, 2023PHOTO | PM Modi flags off metro trains marking inauguration of completed sections of Pune Metro. pic.twitter.com/aWQDqTB2TI
— Press Trust of India (@PTI_News) August 1, 2023
"తిలక్ లాంటి గొప్ప పోరాట యోధుని అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని తిలక్ బాగా అర్థం చేసుకున్నారు. ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో ముందుడి నడిచారు. ఉద్యమ గమనాన్ని మార్చేశారు. యువతలోని నైపుణ్యాన్ని గుర్తించడంలో తిలక్ ప్రత్యేక స్థానం ఉంది. అందుకు ఉదాహరణ వీర్ సావర్కర్. విదేశాల్లో విద్య విషయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను గుర్తించింది తిలక్. కొంత మంది విదేశీ అక్రమణదారుల పేర్లు మార్చితే కొందరు అసహనానికి గురవుతున్నారు."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రతిపక్షాల కోరికకు నో
ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న శరద్ పవార్‌ను మోదీతో వేదిక పంచుకోవద్దంటూ పలు ప్రతిపక్షాలు కోరాయి. బీజేపీపై పోరాడుతూ మోదీతో వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలు పంపిస్తోందంటూ చెప్పాయి. కానీ వారి మాటలను పక్కనపెడుతూ మోదీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ పాల్గొనే కార్యక్రమానికి వెళ్లవద్దని... విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన కొందరు ఎంపీలను శరద్ పవార్ కలవలేదు. ఎన్సీపీని అవినీతి పార్టీగా అభివర్ణించి, పార్టీలో చీలిక తెచ్చిన మోదీ కార్యక్రమానికి పవార్ వెళ్లడంపై.. శివసేన ఉద్ధవ్ వర్గం తప్పుబట్టింది. పవార్ వైఖరిని అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించింది.
Tilak Smarak award 2023 : 'ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్' (హింద్ స్వరాజ్ సంఘ్) అనే సంస్థ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్మాన్య తిలక్ నేషనల్ అవార్డు ప్రకటించింది. మోదీ నాయకత్వ పటిమకు, పౌరుల్లో దేశభక్తిని పెంపొందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డును 1983 నుంచి ఏటా అందజేస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 1 తేదీన ఈ అవార్డును ఇస్తారు.
ఇవీ చదవండి : టార్గెట్ సౌత్ ఇండియా.. 2024లో దక్షిణాదిలోని ఈ నియోజకవర్గం నుంచి మోదీ పోటీ!