భద్రతా బలగాలపై జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ఆదివారంతో రెండేళ్లు పూర్తి అయ్యింది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల శౌర్యం, త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదని ట్వీట్ చేశారు.
-
I bow down to the brave martyrs who lost their lives in the gruesome Pulwama attack on this day in 2019.
— Amit Shah (@AmitShah) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
India will never forget their exceptional courage and supreme sacrifice.
">I bow down to the brave martyrs who lost their lives in the gruesome Pulwama attack on this day in 2019.
— Amit Shah (@AmitShah) February 14, 2021
India will never forget their exceptional courage and supreme sacrifice.I bow down to the brave martyrs who lost their lives in the gruesome Pulwama attack on this day in 2019.
— Amit Shah (@AmitShah) February 14, 2021
India will never forget their exceptional courage and supreme sacrifice.
రక్షణ మంత్రి నివాళులు..
2019 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశం కోసం వారు చేసిన సేవలను, త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మరవదని తెలిపారు.
నడ్డా నివాళులు..
పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
-
जम्मू कश्मीर के पुलवामा में हुए आतंकी हमले में शहीद होने वाले माँ भारती के वीर सपूतों को कोटि-कोटि नमन।
— Jagat Prakash Nadda (@JPNadda) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
आपके अदम्य साहस, वीरता व शौर्य का राष्ट्र सदैव ऋणी रहेगा।
">जम्मू कश्मीर के पुलवामा में हुए आतंकी हमले में शहीद होने वाले माँ भारती के वीर सपूतों को कोटि-कोटि नमन।
— Jagat Prakash Nadda (@JPNadda) February 14, 2021
आपके अदम्य साहस, वीरता व शौर्य का राष्ट्र सदैव ऋणी रहेगा।जम्मू कश्मीर के पुलवामा में हुए आतंकी हमले में शहीद होने वाले माँ भारती के वीर सपूतों को कोटि-कोटि नमन।
— Jagat Prakash Nadda (@JPNadda) February 14, 2021
आपके अदम्य साहस, वीरता व शौर्य का राष्ट्र सदैव ऋणी रहेगा।
" జమ్ముకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డలకు నా నివాళులు. వారి ధైర్య సాహసాలకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది."
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
రాహుల్ నివాళులు..
పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుందని ట్వీట్ చేశారు.
-
पुलवामा हमले में शहीद हुए वीर सैनिकों को श्रद्धांजलि और उनके परिवारों को नमन।
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
देश आपका ऋणी है।
">पुलवामा हमले में शहीद हुए वीर सैनिकों को श्रद्धांजलि और उनके परिवारों को नमन।
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2021
देश आपका ऋणी है।पुलवामा हमले में शहीद हुए वीर सैनिकों को श्रद्धांजलि और उनके परिवारों को नमन।
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2021
देश आपका ऋणी है।
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదన్నారు.
సీఆర్పీఎఫ్ నివాళులు..
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించింది సీఆర్పీఎఫ్. దాడి ఘటనాస్థలిలోని స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించారు అధికారులు.
జవాన్ల జ్ఞాపకార్థం గత ఏడాది పుల్వామాలోని దాడి ప్రాంతంలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు.
ఆత్మాహుతి దాడి..
2019, ఫిబ్రవరి 14న.. 2,500మందితో 75 బస్సుల సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్ వెళుతున్న క్రమంలో పుల్వామాలో దాడి జరిగింది. ఐఈడీలు నిండిన కారుతో అదిల్ అహ్మద్ దార్ అనే ఉగ్రవాది దాడి చేశాడు. ఈ దుర్ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనేని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది.
ఇవీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో బాంబుదాడి, 40 మంది జవాన్లు మృతి