ETV Bharat / bharat

Mystery Well: 'మాయా బావి' గుట్టు తేల్చే పనిలో పరిశోధకులు - బావి మిస్టరీ

Mystery Well: వేలాది గ్యాలన్ల నీటని మింగేస్తోన్న తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని మాయా బావి గుట్టు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు ఐఐటీ-ఎం పరిశోధకులు. రెండు రోజులుగా వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. అన్ని అంశాలను పరిశీలించి ఓ అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

Mystery Well
మాయా బావి
author img

By

Published : Dec 4, 2021, 5:38 AM IST

'మాయా బావి' గుట్టు తేల్చే పనిలో పరిశోధకులు

Mystery Well: అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. వేలాది గ్యాలన్ల నీటని అమాంతం మింగేస్తోంది తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని 'మాయా బావి'. గ్రామం సమీపంలోని నది ఉప్పొంగి వస్తున్న 50 క్యూసెక్కుల నీటిని వారం రోజులు పాటు బావిలోకి పంపినా నిండలేదు. ఇప్పుడు ఈ మాయా బావి గుట్టు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు పరిశోధకులు. తిసయ్యన్​వేలి పట్టణానికి సమీపంలోని అయంకుళం పడుగై గ్రామంలో ఉన్న ఈ మాయా బావిపై మద్రాస్​ ఐఐటీ బృందం వివిధ కోణాల్లో పరిశోధనలు చేపట్టింది.

బావి గురించి తెలుసుకున్న తమిళనాడు అసెంబ్లీ స్పీకర్​ అప్పవు, జిల్లా కలెక్టర్​ విష్ణు రెండు రోజుల క్రితం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్రాస్​ ఐఐటీ బృందాన్ని పంపించి పరిశోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ క్రమంలో ప్రొఫెసర్లు వెంకట రమణన్​, శ్రీనివాసన్ నేతృత్వంలోని బృందం బావి వద్దకు వెళ్లింది. భారీగా వర్షపు నీరు చేరుతున్నా ఎందుకు నిండటం లేదనే కోణంలో పరిశోధనలు చేపట్టింది. అలాగే బావి గురించి, ఇలా ఎంతకాలం నుంచి జరుగుతుంది అనే విషయాలను స్థానికుల నుంచి సేకరించింది ఐఐటీ బృందం. ఇందులోకి చేరుతున్న నీరు సమీపంలోని బావుల్లోకి వెళ్తుండవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. సమీపంలోని నూతల నీటి నమూనాలను సేకరించింది.

Mystery Well
బావి వద్ద పరిశోధకుల బృందం

మరోవైపు.. వర్షాలతో బావులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నా ఈ బావి నిండకపోవటంపై ముందుగా ఆశ్చర్యపోయామని గ్రామస్థులు తెలిపారు. అందులోకి పోతున్న వర్షపు నీరు ఎటు వెళుతుందనే అంశంపై తేల్చుకోలేకపోయామని చెప్పారు. అయితే.. బావి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, అందులోకి వెళుతున్న నీరు మంచి నీటిగా మారుతోందని భావిస్తున్నామని అన్నారు.

వివిధ ఎన్​జీఓలు, వలంటీర్లు, అన్నా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు, ప్రైవేట్​ కళాశాలల విద్యార్థులు సైతం ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. మాయా బావి గురించి తెలుసుకోవాలని ప్రజలు, అధికారులు, పరిశోధకులు ఉత్సాహంగా ఉన్నారు.

ఇదీ చూడండి: వేల లీటర్ల నీటిని మింగేస్తున్న 'మాయా బావి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.