ఒడిశా బర్హంపుర్ నగరంలో కేవలం పది రోజుల్లోనే 400-500 పందులు మృత్యువాత పడటం కలకలం రేపింది. ఇది స్వైన్ ఫ్లూ అని గ్రామస్థులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాల కోసం వాటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు పశువైద్య అధికారులు తెలిపారు. పందులు ఒక్కసారిగా అస్వస్థకు గురై... ఆహారాన్ని తీసుకోవటం లేదని గ్రామస్థులు తెలిపారు.
పందులు నడవలేని స్థితిలోకి వెళ్లి... కొద్ది గంటల్లోనే మరణిస్తున్నాయన్నారు. ప్రజలు పంది మాంసాన్ని తినవద్దని అధికారులు ఆదేశించారు.
ఇదీ చదవండి : రూ.కోటిన్నర విలువగల గంజాయి పట్టివేత