ETV Bharat / bharat

భార్యాబిడ్డల దారుణ హత్య.. తలను తీసుకెళ్లి గ్రామ కల్వర్టుపై.. - భార్య కుతూర్లు హత్య భర్త

భార్యకూతుళ్లను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఆ తర్వాత భార్య తలను తీసుకెళ్లి అత్తవారి గ్రామ కల్వర్టుపై విడిచిపెట్టి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన బిహార్​లోని మాధేపురాలో జరిగింది.

Murderer Zibrail Confession Of Daughter And Wife In Madhepura

author img

By

Published : Aug 6, 2022, 10:52 PM IST

బిహార్​లోని మాధేపురా జిల్లాలో దారుణం జరిగింది. భార్యాకూతుళ్లను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఆపై భార్య తలను తీసుకెళ్లి.. తన అత్తవారి ఊరి కల్వర్టు మీద విడిచిపెట్టి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని పోఖారియా తోలా గ్రామానికి చెందిన మహ్మద్ జిబ్రీల్​ ఆలం.. భార్య ముర్షిదా, మూడేళ్ల కుమార్తె జియా పర్వీన్​లను కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా భార్య తలను తీసుకుని తన అత్తమామల గ్రామమైన గోధెలా కల్వర్టుపై వదిలిపెట్టి పారిపోయాడు. శనివారం ఉదయం మార్నింగ్​ వాక్​కు వచ్చిన ప్రజలు.. మొండెం లేని తలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు.

అయితే హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. జిబ్రీల్​ నివాసానికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న జిబ్రీల్​ భార్యాకుమార్తెల మృతదేహాలను పోస్టు​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న ఓ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈలోపల ఘటన గురించి తెలుసుకున్న వేలాది మంది ప్రజలు జిబ్రీల్​ నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులు.. జిబ్రీల్ సవతి తల్లి, అతడి సోదరుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

జిబ్రీల్​, ముర్షిదాకు 12 ఏళ్ల క్రితం వివాహమైనట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారి వివాహ బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారని, అందులో ఇద్దరు కొడుకులు మేనమామ ఇంటి దగ్గర చదువుకుంటున్నారని తెలిపారు. కేవలం కుమార్తె మాత్రమే జిబ్రీల్​ దగ్గర ఉంటుందని చెప్పారు. జిబ్రీల్​, ముర్శిదా మధ్య తరచూ చిన్నపాటి విషయాలపై గొడవలు జరిగేవని, భార్యపై అనుమానంతోనే​ జిబ్రీల్​ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని స్థానికులు అంటున్నారు.

ఇవీ చదవండి: అక్కడ అంత్యక్రియలు చేయాలంటే.. నదిలో శవాన్ని మోసుకెళ్లాల్సిందే!

పోలీస్​స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. కానిస్టేబుల్‌పై మూక దాడి.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.