కేరళ భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయం ఇంకా ఖరారు కాలేదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్పష్టం చేశారు. ముందుగా అనుకున్నట్లు మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన దిల్లీ మాజీ మెట్రో చీఫ్ శ్రీధరన్ పేరును పార్టీ అధిష్ఠానం ఇంకా ఖరారు చేయాలేదని పేర్కొన్నారు.
"నేను కొన్ని వార్తలను విన్నాను. ఈ. శ్రీధరన్‌ని పార్టీ పెద్దలు రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు అని. కానీ నేను అధిష్ఠానంతో మాట్లాడిన తరువాత తెలిసింది. అధికారికంగా అటువంటి ప్రకటన అంటూ ఏదీ లేదని. మీకు అందినవి పుకార్లు మాత్రమే."
- మురళీధరన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి
అయితే శ్రీధరన్‌ను భాజపా కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మురళీధరన్‌నే ముందుగా ప్రకటించడం గమనార్హం.
'రాబోయే ఎన్నికల్లో కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ శ్రీధరన్‌ను ప్రకటించింది. ఆయన సారథ్యంలో సీపీఐఎం, కాంగ్రెస్‌ల అవినీతి కడిగేస్తాం. సుపరిపాలనను కేరళ ప్రజలకు అందిస్తామని' మురళీధరన్ ట్వీట్ కూడా చేశారు.