Mumbai Student arrest: సామాజిక మాధ్యమాల్లో యువతి నగ్న చిత్రాలను పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఓషివారాకు చెందిన 22 ఏళ్ల అమన్ఖాన్గా గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. నిందితుడు అమన్‌ఖాన్ తన పేరు మీద నకిలీ ఖాతా సృష్టించి తన నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు తనకు వీడియో కాల్ చేసి వేధింపులకు గురిచేసేవాడని బాలిక ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. పోలీసు దర్యాప్తులో.. నిందితుడు బాధితురాలి నగ్న చిత్రాలను ఆమె కుటుంబ సభ్యలు, స్నేహితులకు పంపినట్లు తేలింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం: ఈ ఏడాది జనవరిలో నిందితుడిపై.. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో నిందితుడు అమన్‌ఖాన్ తనను బెదిరిస్తున్నాడని, నగ్న చిత్రాలను బహిరంగపరిచాడని పేర్కొంది. అప్పుడు దక్షిణ ముంబయిలోని పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు. కొన్ని రోజుల తరువాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. మరల నిందితుడు అమన్‌ఖాన్ తన నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం అతడిని అరెస్టు చేశారు.
తప్పుడు కేసులో పోలీసులు నా కుమారుడిని ఇరికించారు. జనవరిలో అరెస్టు అయినప్పటి నుంచి నా బిడ్డ ఫోన్ వాడట్లేదు. అయినప్పటికి నా కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. జనవరిలోనే నా కొడుకు మొబైల్ ఫోన్‌తో పాటుగా.. నాది, నా కుమార్తె మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాకు జరిగిన అన్యాయంపై ముంబయి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా.
-నిందితుడి తల్లి
ఇదీ చదవండి: పాపం.. ఐస్‌క్రీం బాక్స్‌లో చిక్కుకొని పిల్లలు మృతి