ETV Bharat / bharat

ప్రేమ-పరిమళం కలగలిసిన ఈ పాన్​ ఖరీదు రూ.లక్ష

ముంబయికి చెందిన ఓ పాన్​వాలా ప్రీమియం పాన్​ను విక్రయిస్తున్నాడు. ఎవరికైనా దీనిని ఒక అరుదైన గిఫ్ట్​గా అందిచొచ్చు అంటున్నాడు ఆ పాన్​వాలా. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా?.. అక్షరాల లక్ష రూపాయలు.

1 lakh rupees paan
లక్ష రూపాయలు విలువ చేసే 'తాజ్​మహల్​ పాన్'
author img

By

Published : Nov 26, 2021, 10:53 AM IST

Updated : Nov 26, 2021, 5:02 PM IST

ప్రేమ-పరిమళం కలగలిసిన ఈ పాన్​ ఖరీదు రూ.లక్ష

మన దేశంలో పాన్​కు ప్రత్యేక స్థానం ఉంది. పాన్​ వేసుకుని నవాబుల్లా ఫీల్​ అవుతుంటారు చాలామంది. మరి ఈ పాన్​ ధర ఎంతుంటుంది? మహా అయితే ఒక 50 రూపాయలు. అయితే.. ముంబయిలో లభించే ఈ ప్రీమియం పాన్​ కొనాలంటే నవాబే అయ్యి ఉండాలి ఏమో. ఎందుకంటే దీని ధర రూ.లక్ష రూపాయలు.

మల్టీనేషనల్​ కంపెనీలో ఉద్యోగం వదులుకొని..

ముంబయి మాహిమ్​ ప్రాంతంలోని 'ది పాన్​ స్టోరీ' పేరుతో ఉండే ఈ పాన్​షాప్​ లోకల్​గా బాగా ఫేమస్​. మల్టీనేషనల్​ కంపెనీలో ఉద్యోగం వదులుకొని ఈ పాన్​ షాప్​ పెట్టిన నౌషాద్​.. అతితక్కువ కాలంలోనే తన వ్యాపారాన్ని లాభాలబాట పట్టించాడు. వివిధ రకాల పాన్​లను విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే నౌషాద్​.. ఈసారి తాజ్​మహల్​ పాన్​ను రూపొందించాడు.

ప్రేమకు ప్రతీకైన తాజ్​మహల్​కు తన స్పెషల్​ పాన్​ను జోడిస్తే ఆ అనుభూతే వేరు అంటున్నాడు నౌషాద్​. దీనిని ఎవరికైనా బహుకరిస్తే ఆ క్షణం వారికి జీవితాంతం గుర్తుండిపోతుందనే నమ్మకంతో ఈ తాజ్​మహల్​ పాన్​ను తయారు చేసినట్లు తెలిపాడు. ఈ పాన్​ కోసం రూ.లక్ష ఖర్చు చేసిన వారు ఆ స్థాయిలోనే అనుభూతిని పొందుతారని చెబుతున్నాడు నౌషాద్.

'ప్రేమ పరిమళం' పేరుతో..

గతంలో ఈ షాపులో 'ప్రేమ పరిమళం' పేరుతో ఓ ప్రత్యేక పాన్​ను నౌషాద్ విక్రయించేవాడు. అందులో రెండు అత్తరు సీసాలను కానుకగా ఇచ్చేవాడు. అయితే కస్టమర్లు ఇంకా ఎక్కువ రకాలు సెంట్లు ఉంటే బాగుంటుందని చెప్పారు. తాను తయారు చేసిన ప్రత్యేక పాన్​తో తాజ్​మహల్​ను ​ ఇవ్వాలని నిర్ణయించాడు. దీనికి ఉండే ఐదు గోపురాల నుంచి ఐదు రకాల అత్తరు సువాసనలు వెదజల్లేలా సీసాలను అమర్చాడు. అంతేకాదు ఆ గోపురాలకు పేర్లు కూడా పెట్టాడు నౌషాద్.

ఇలాంటి ప్రీమియం పాన్​లను విక్రయించడం నౌషాద్​కు కొత్తేం కాదు. నౌషాద్​ దుకాణంలో రూ.35 నుంచి రూ. లక్ష విలువ చేసే పాన్​లు అనేక రకాలు లభిస్తాయి.

ఇదీ చూడండి : Gangs of Wasseypur: 'అతడ్ని చంపింది నేనే.. ఆరు నెలల్లో వారందరినీ లేపేసి...'

Last Updated : Nov 26, 2021, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.