ETV Bharat / bharat

భద్రతా వలయంలో ఎర్రకోట- రంగంలోకి షార్ప్ షూటర్లు - ఎర్రకోట దిల్లీ

స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతున్న వేళ.. దిల్లీలో భద్రతను పటిష్ఠం చేశారు అధికారులు. ఎర్రకోట వద్ద ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. షార్ప్ షూటర్లు, స్నైపర్లను రంగంలోకి దించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను నెలకొల్పారు. ఒలింపిక్స్​కు హాజరైన భారత క్రీడాకారులు వేడుకకు హాజరు కానుండగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విషయాలపై ప్రసంగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

independence red fort
ఎర్రకోట
author img

By

Published : Aug 14, 2021, 3:41 PM IST

Updated : Aug 14, 2021, 4:05 PM IST

పంద్రాగస్టు వేడుకల కోసం దిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్రసంగించే ఎర్రకోట వద్ద బహుళ స్థాయి రక్షణ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎన్​ఎస్​జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, శునకాలను రంగంలోకి దించారు. ఎర్రకోట పరిసరాల్లో ఉన్న ఆకాశహర్మ్యాలపై షార్ప్​ షూటర్లను మోహరించారు. జమ్ము విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో ఎర్రకోట వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఇన్​స్టాల్ చేశారు.

independence redfort
త్రివిధ దళ సిబ్బంది రిహార్సల్స్
independence redfort
నావికా దళ సిబ్బంది రిహార్సల్స్

మొత్తంగా.. ఎర్రకోట వద్ద ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 350 కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని రెండు కంట్రోల్ రూంలలోని పోలీసులు అనుక్షణం పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. 70 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్​లు, తక్షణ స్పందన బృందాలను మోహరించనున్నట్లు చెప్పారు.

independence redfort
సిబ్బంది పహారా; చిత్రంలో 17వ శతాబ్దం నాటి ఫిరంగి; బాంబును గుర్తించే రోబో

కంటైనర్ల గోడ

తొలిసారి ఎర్రకోట ప్రధాన ప్రవేశద్వారం వద్ద తాత్కాలిక గోడ నిర్మించారు. షిప్పింగ్ కంటైనర్లతో భారీ అడ్డుగోడ ఏర్పాటు చేశారు. వీటిని గ్రాఫిటీతో అందంగా అలంకరించారు. కోటలోని పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతర వ్యక్తులు లోపలికి రాకుండా ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను దృష్టిలో పెట్టుకునే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక నిరసనలు పునరావృతం కాకుండా ఇలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

independence redfort
పెయింటింగ్ వేసిన కంటైనర్ల ముందు వరుసలో కూర్చున్న విద్యార్థులు

దిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ భద్రతను పటిష్ఠం చేశారు. యమునా నది చుట్టుపక్కల పోలీసులు ద్విచక్ర వాహనాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

independence redfort
ప్రధానికి భద్రత కల్పించే ఎస్​పీజీ దళం మాక్ డ్రిల్
independence redfort
దిల్లీ పోలీసుల మాక్ డ్రిల్

ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నేపథ్యంలో దిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. ప్రజలకు అడ్వైజరీ జారీ చేశారు. ఎనిమిది మార్గాలను ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు మూసేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్​బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్​క్రాఫ్ట్​లపై ఆగస్టు 16 వరకు నిషేధం ఉందని గుర్తు చేశారు.

కరోనా నిబంధనలతో...

వేడుకల్లో కరోనా నిబంధనలను పాటించనున్నారు. వీక్షకులు భౌతిక దూరం పాటించి కూర్చుంటారు. టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందం ప్రత్యేక అతిథులుగా ఉత్సవాలకు హాజరు కానున్నారు.

మోదీ ఏం మాట్లాడతారు?

సంప్రదాయాన్ని అనుసరించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలో కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల మధ్య.. ప్రధాని ఏం మాట్లాడతారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 14, 2021, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.