ETV Bharat / bharat

C.1.2 Variant: భారత్​లో ప్రమాదకర మ్యు, సీ.1.2. కేసులున్నాయా? - VIRUS VARIANTS

డెల్టానే ఇప్పటికీ.. భారత్​లో ఆందోళనకరమైన కరోనా వేరియంట్​గా ఉందని తెలిపింది జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం- ఇన్సాకాగ్ (INSACOG)​. అయితే.. ఇటీవల వెలుగుచూసిన కరోనా రకాల్లో ప్రమాదకరమైన మ్యు, సీ.1.2.(C.1.2 Variant) వేరియంట్లపై కీలక ప్రకటన చేసింది. టీకాలను ఏమార్చే గుణాలున్న.. ఈ తరహా కరోనా కేసులు భారత్​లో ఉన్నాయా? కట్టడి చేయడం ఎలా? ఇన్సాకాగ్​ ఏం చెప్పింది..

C.1.2 Variant, Mu
భారత్​లో ప్రమాదకర మ్యు, సీ.1.2. కరోనా వేరియంట్లు
author img

By

Published : Sep 15, 2021, 3:30 PM IST

సార్స్-​ కోవ్​2లోని (SARS-CoV2) కొత్త వైరస్​ రకాలు మ్యు, సీ.1.2 తరహా కేసులు ఇంతవరకు భారత్​లో నమోదు కాలేదని.. జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం- ఇన్సాకాగ్​(INSACOG)​ పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికులకు.. కఠిన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆగస్టు 30న.. బీ.1.621ను (బీ.1.621.1 సహా) వేరియంట్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​గా(వీఓఐ) గుర్తించింది. దీనికే మ్యు అని నామకరణం చేసింది. మరో కొత్త రకం వైరస్​ వేరియంట్​.. సీ.1.2ను(C.1.2 Covid Variant) కూడా ఇటీవలే ఈ జాబితాలో చేర్చింది.

వైరస్​ ఉద్ధృతి పెంచే విధంగా వైరస్​ వేరియంట్లలో(Corona Variants) మార్పులు జరిగితే దానిని 'వేరియంట్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​'గా గుర్తిస్తారు.

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ప్రమాదకరమైన సీ.1 వేరియంట్​ నుంచి వచ్చిన ఉత్పరివర్తనమే సీ.1.2. కానీ.. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించలేదు. ఈ నేపథ్యంలో భారత్​లోనూ ఈ తరహా కేసుల్లేవని, అయితే జాగ్రత్తగా ఉండాలని ఇన్సాకాగ్​ స్పష్టం చేసింది.

''మ్యు గానీ, సీ.1.2. కానీ భారత్​లో ఇప్పటివరకు వెలుగుచూడలేదు. అయితే.. అంతర్జాతీయ ప్రయాణికులకు ఆంక్షలు ఇంకా కఠినతరం చేయాల్సి ఉంది.''

- ఇన్సాకాగ్​

డెల్టా, దానిలోని ఇతర వేరియంట్లే ఇప్పటివరకు.. భారత్​లో ఆందోళనకర వైరస్​ రకాలుగా(వీఓసీ) ఉన్నాయని ఇన్సాకాగ్​ తెలిపింది. డెల్టా(Delta Variant India) ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్​లో.. భయంకరమైన కరోనా రెండో దశకు(Corona 2nd Wave) కారణమైంది డెల్టానే.

మ్యు వేరియంట్​కు.. టీకాలను ఏమార్చే గుణాలున్నాయని, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని చెప్పింది ఇన్సాకాగ్​.

అయితే.. మ్యు కేసులు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా లేవని, కొలంబియా, ఈక్వెడార్​లోనే దీని వ్యాప్తి అధికమని డబ్ల్యూహెచ్​ఓ ఇటీవల పేర్కొంది. మ్యుటేషన్​ రేటు ఎక్కువగా(తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ మ్యుటేషన్లు బయటపడటం) ఉన్న.. సీ.1.2 పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, దీనిని కట్టడి చేయడం అత్యావశ్యకమని తెలిపింది.

ఇవీ చూడండి: టీకా తీసుకున్నవారికీ కరోనా- అసలు కారణం ఇదే!

మరో కొత్త వేరియంట్‌.. వ్యాక్సిన్‌కు తలొగ్గని 'మ్యూ'!

C.1.2 virus: కొత్త వేరియంట్​తో​ ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.