ETV Bharat / bharat

జిమ్​లో 'గర్ల్​ఫ్రెండ్​'తో భర్త.. ఇద్దరినీ చితకబాదిన భార్య - భర్తపై చెప్పులతో దాడి

భర్త వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అనుమానిస్తూ చెప్పులతో దాడికి దిగింది భార్య. అనుమానిత మహిళ, భర్తపై విరుచుకుపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​ భోపాల్​​లోని ఓ జిమ్​లో జరిగింది.

wife beaten husband
భర్తపై చెప్పులతో దాడి
author img

By

Published : Oct 18, 2021, 4:41 PM IST

జిమ్​లో చెప్పులతో దాడి.. భర్త వివాహేతర సంబంధమే కారణమా?

మధ్యప్రదేశ్​ భోపాల్​లోని ఓ జిమ్​లో విస్తుపోయే సంఘటన జరిగింది. తన భర్త ఓ మహిళను ప్రేమిస్తున్నాడని అనుమానిస్తూ.. చెప్పులతో దాడికి దిగింది భార్య. భర్తను, ఆ మహిళను చెప్పులతో చితకబాదింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఓ మహిళ(30) తన సోదరితో కలిసి ఆమె భర్త కసరత్తులు చేస్తున్న జిమ్​కు వెళ్లింది. భర్తతో ప్రేమలో ఉందని అనుమానిస్తున్న మహిళ కూడా అక్కడే ఉంది. ఒక్కసారిగా చెప్పులు చేతపట్టుకుని భర్త, పక్కనున్న మహిళపై దాడికి దిగింది. జిమ్​లో ఉన్నవారందరూ ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

భార్య ఆరోపణలను భర్త తోసిపుచ్చాడు. తనకు ఆమె ఎవరో కూడా తెలియదని అన్నాడు. ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: స్నేహితులతో కలిసి హత్య చేసి.. మృతదేహంతో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.